Raise HDL Level: శరీరంలో చెడుకొలెస్ట్రాల్ తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలు..

HDL Level Raise Foods: మన శరీరంలోని కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్ ,చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలున్నాయి. హెచ్‌డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రొటీన్ ఇవి గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల నుండి చెడు కొలెస్ట్రాల్ ని తీసివేసి కాలేయానికి చేర్చటంలో సహాయపడుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 18, 2024, 03:25 PM IST
Raise HDL Level: శరీరంలో చెడుకొలెస్ట్రాల్ తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలు..

HDL Level Raise Foods: మన శరీరంలోని కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్ ,చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలున్నాయి. హెచ్‌డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రొటీన్ ఇవి గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల నుండి చెడు కొలెస్ట్రాల్ ని తీసివేసి కాలేయానికి చేర్చటంలో సహాయపడుతుంది. అప్పుడు మన కాలేయం వీటిని ఫిల్టర్ చేస్తుంది. అందుకే మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండాలని అంటారు. మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎక్కువ మంచి కొలెస్ట్రాల్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. పురుషుల్లో హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ 40 లేదా అంతకంటే తక్కువ మహిళల్లో 50 లేదా అంతకంటే తక్కువ ఉండకూడదు. దీంతో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే సమస్య ఉంటుంది. మనకు చాలా తక్కువ మంచి కొలెస్ట్రాల్ ఉంటే మనకు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

ఆకుకూరలు, కాలే బ్రోకలీ కాలీఫ్లవర్ ముదురు, పచ్చ ఆకుకూరలు వంటి అధిక ఫైబర్ కూరగాయలు శరీరానికి అద్భుతమైనవి. వంకాయ రెడ్ క్యాబేజీ వంటి కూరగాయలలో ఆంథోసైనిన్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలో హెచ్‌డి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయ పడతాయి.

ఇదీ చదవండి: దంచికొడుతున్న ఎండలు.. ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే..

తృణధాన్యాలు. మిల్లెట్స్, సజ్జలు, రాగులు, జొన్నలు, ఓట్స్ మరియు గోధుమ వంటి ధాన్యాలు హెచ్‌డి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. ఎందుకంటే అటువంటి ఆహారాలలో ఫైబర్ ఉంటుంది. వైన్ ముఖ్యంగా రెడ్ వైన్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రెడ్ వైన్ లో రెస్వెరాట్రాల్  ఉంటాయి. వైన్లో పాలీఫెనాల్స్ అధికంగా ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ సమ్మేళనాలు హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. మితమైన మోతాదులో వైన్ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని నివేదికలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఆల్కహాల్ ను ప్రారంభించమని మేము ఎప్పుడు సూచించాం. కానీ క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకునే వారు జాగ్రత్తవహించాలి.

ఇదీ చదవండి: వేసవికాలంలో రాగి పాత్రలోని నీటిని తాగితే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే..

అవకాడలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మినరల్స్, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. అంతేకాదు కొకొ పౌడర్ వల్ల కూడా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇందులో ఉండే పాలిఫెనల్స్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.వారంలో ఓ రెండు మూడు సార్లు చేపలను ఆహారంలో చేర్చుకుంటే కూడా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మాకేరల్, ట్యూనా, సార్డినెస్‌ వంటి చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News