Chilakaluripeta TDP-BJP-JSP Combines Praja Galam Public Meeting: కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించగానే దేశంలో ఎక్కడ చూసిన ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల హీట్ కన్పిస్తుంది. ఇక అన్నిరాజకీయ పార్టీలు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి . దీనిలో భాగంగా.. ఏపీలో ఏప్రిల్ 18 ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. ఏప్రిల్ 25వరకు నామినేషన్లు స్వీకరణకు తుదిగడువుగా నిర్ణయించారు., ఏప్రిల్ 26 నామినేషన్లను పరిశీలిస్తారు, ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే నెలలో 13 తేదీన ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4 న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..
అదే విధంగా ఎన్నికలలో కోడ్ ఇప్పటికే అమల్లలోకి వచ్చేసింది. కోడ్ సమయంలో పాటించాల్సిన విధివిధానాలపై కూడా ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచాయి. మరోవైపు వైఎస్సార్సీపీ జగన్ మోహన్ రెడ్డి సింగిల్ గా మరోసారి ఎన్నికలలోకి వెళ్లనున్నారు.
ఇదిలా ఉండగా.. ఆదివారం రోజు ఆంధ్ర ప్రదేశ్ లోని చిలకలూరిపేటలో బొప్పూడి లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభ కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు. ఈ క్రమంలో ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హజరయ్యారు. జనసేన అధినేత ప్రసంగిస్తున్నారు. స్టేటియం అంతాట లక్షలాదిమంది కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసిన కూడా కార్యకర్తలు ఉల్లాసంగా అరుపులు, కేకలు పెడుతు సభలో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రసంగిస్తున్నారు. ఇంతలో దేశ ప్రధాని ఒక్కసారిగా కల్గచేసుకుని పవన్ ను అలర్ట్ చేశారు. కొందరు అక్కడ ఫ్లడ్ లైట్ల మీద ఎక్కి కార్యక్రమం చూస్తున్నారు.
Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?
పదుల సంఖ్యలో కార్యకర్తలు ఎలక్ట్రిక్ ఫ్లడ్ లైట్ల మీద నుంచి నిలబడి తమ అభిమాన నేతలు ఉన్న సభను చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని కల్గ చేసుకుని వెంటనేఉ ఎలక్ట్రిక్ పోల్ నుంచి కిందకు దిగాలని కార్యకర్తలను కోరారు. అక్కడ ఉన్న పోలీసులను అలర్ట్ చేశారు. కరెంట్ స్తంభం ఎక్కకార్యక్రమం చూస్తున్నారు. అనుకొని ఘటన జరగడానికి అవకాశం ఉందని కూడా అందరిని వారించారు. జనసేనాని కూడా కార్యకర్తలను దిగాలని పలుమార్లు అభ్యర్థించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రెండు చేతులతో దండంపెట్టి మరీ కార్యకర్తలను ఫ్లడ్ లైట్ల స్థంబం నుంచి కిందకు దిగాలని కోరారు. ముందుగానే ప్రమాదం పసిగట్టి ప్రధాని మోదీ, అందరిని అలర్ట్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook