AP Govt DAs: ఎన్నికల ప్రకటన రాబోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరేలా కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు డీఏలను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం. ఎన్నికల ప్రకటన విడుదలయ్యేలోపు ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలైతే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ లబ్ధి చేకూతుంది. ఏప్రిల్ నెల జీతంతో కూడిన ఒక డీఏ, జూలై నెల జీతంతో కూడిన మరొక డీఏ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Also Read: KTR: ప్రియమైన చెల్లెలు కవిత అరెస్ట్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్.. ఏమన్నారంటే?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముంగిట సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు డీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల ప్రకటన వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు మేలే చేసే అవకాశం ఉండదనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలిగించే నిర్ణయాలు సీఎం జగన్ తీసుకుంటున్నారు.
Also Read: Pithapuram: పవన్ కల్యాణ్ పోటీ.. అగ్గి మీద గుగ్గిలమైన పిఠాపురం.. టీడీపీ శ్రేణుల భగ్గు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలు ప్రకటించిన సీఎం జగన్