Surya Kiran Passed Away: చిత్ర సీమను వరుస విషాదాలు వెంటాతున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన తెలుగులో సుమంత్ హీరోగా 'సత్యం' సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత సుమంత్ హీరోగా ధన 51 సినిమాలను తెరకెక్కించారు. ఆ తర్వాత జగపతి బాబుతో బ్రహ్మాస్త్రం, ఛాప్టర్ 6 మంచు మనోజ్ హీరోగా రాజు భాయ్ సినిమాలను తెరకెక్కించారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన 'అరసి' అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. సత్యం సినిమా మినహా మరే సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయాయి. ఆ మధ్య ఈయన నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 4 షోలో ఒక కంటెస్టెంట్‌గా చేసాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈయన కెరీర్ డైలామా పడిపోయింది. ఈయన కేవలం దర్శకుడిగానే కాకుండా.. బాలనటుడిగా దక్షిణాదిలో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగా రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు. దర్శకుడిగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి రెండు నంది అవార్డులను సైతం అందుకున్నాడు.
ప్రముఖ సీరియల్ నటి సుజిత్ ఈయనకు స్వయానా సోదరి. మరోవైపు నటి కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఈయన మృతిపై తెలుగు చిత్ర సీమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు ఇలా అకాల మరణం చెందడంపై సినీ ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన గత కొంత కాలంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. దీనికి వైద్యం చేయించుకుంటున్నారు. ఇంతలోనే కామెర్లు తిరగబడటంతో ఈయన చనిపోయినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మంగళవారం చైన్నైలో సూర్య కిరణ్ అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook