Inti No.13: ‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ వంటి హారర్ థ్రిల్లర్స్‌తో టాలీవుడ్ ఆడియన్స్‌కు అలరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పన్నా రాయల్. ఆయన దర్శకత్వంలో వస్తోన్న మరో హార్రర్ మూవీ ఇంటి నంబర్ 13'. ఈ సారి ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తోన్న మూవీ 'ఇంటి నంబర్ 13'. మార్చి 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇపుడు వస్తోన్న హార్రర్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుందని చిత్ర దర్శక, నిర్మాతలు కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు. గతంలో ఈ టైటిల్‌తో తెలుగులో ఓ సినిమా వచ్చిన మంచి విజయాన్ని అందుకుంది. ఇపుడు అదే టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
రీగల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ బర్కతుల్లా ఈ చిత్రాన్ని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. హేషన్ పాషా ఈ సినిమాను నిర్మించారు.ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్‌గా ఉన్న టైటిల్.. అంతే డిఫరెంట్‌గా ఉన్న ఫస్ట్‌లుక్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు.
హారర్ సినిమాల్లోనే ఇదో డిఫరెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఇంటి నెం.13’ తెరకెక్కింది. ఈ చిత్రం మార్చి 1న తెలుగు రాష్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. మాములుగా కొన్ని హాలీవుడ్‌లో తెరకెక్కిన కొన్ని హారర్ సినిమాల కోసం ఆడియన్స్ రియాక్షన్‌ని క్యాప్చర్ చేసి దాన్ని ప్రమోషన్‌లో వాడటుంటారు. ఆ తరహాలోనే ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించి సినిమా చూస్తున్న సమయంలో ఆడియన్స్ రియాక్షన్‌ని క్యాప్చర్ చేశారు మేకర్స్. ఇలా చేయడంవల్ల ఆడియన్స్‌ని ఈ సినిమా ఏమేర భయపెట్టింది అనేది తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాను ఇలాగే ఆడియన్స్‌ను క్యాప్చర్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంతేకాదు నగరంలోని కొన్ని షాపింగ్ మాల్స్‌లో ‘ఇంటి నెం.13’ ప్రమోషన్ ప్రేక్షకులన అట్రాక్ట్ చేస్తోంది. సినిమాకి సంబంధించి గెటప్స్‌లో ఉన్న వ్యక్తులు ‘ఇంటి నెం.13’ ఫోటోకార్డ్స్‌తో అక్కడికి వచ్చే కస్టమర్స్‌ని ఆకర్షించే పనిలో ఉన్నారు. ఓ తెలుగు సినిమాని ఒక హాలీవుడ్ మూవీలా పబ్లిసిటీ చేస్తున్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారు.దీంతో ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా పెరిగాయి. జనం ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు భయపెట్టి కలెక్షన్స్‌ను రాబడుతుందో చూడాలి.
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter