Mokshagna: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నందమూరి మోక్షజ్ఞ లేటస్ట్ లుక్..

Mokshagna Nandamuri: గత దశాబ్ద కాలంగా బాలయ్య అభిమమానులు తమ హీరో కుమారుడు సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడా తన కుమారుడు అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు చెప్పాడు. తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 23, 2024, 12:17 PM IST
Mokshagna: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నందమూరి మోక్షజ్ఞ లేటస్ట్ లుక్..

Mokshagna Nandamuri: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఫ్యామిలీ హీరోలు కథానాయకులుగా తమ లక్‌ను పరీక్షించుకున్నారు. కానీ బాలయ్య కుమారుడు అపుడెపుడో దశాబ్దం క్రితం వచ్చిన లెజెండ్ మూవీ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అభిమానులు మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు.

నందమూరి వంశం నుంచి కొత్త హీరో వచ్చిన దాదాపు 18 యేళ్లు కావొస్తోంది. అప్పట్లో బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ఆదిత్య 369 మూవీ సీక్వెల్ ఆదిత్య 999 మాక్స్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ తర్వాత ఆ ఇంటి నుంచి ఇప్పటి వరకు ఏ హీరో సినీ రంగంలోకి ప్రవేశించలేదు. దీంతో హీరోగా మోక్షు ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య మోక్షజ్ఞ లావు కనిపించి అభిమానులకు షాక్‌కు గురి చేసాడు. అంతేకాదు మధ్యలో అతను హీరోగా చేయడంపై ఇంట్రెస్ట్ లేదని వాదనలు వినిపించాయి. కానీ బాలయ్య మాత్రం మోక్షజ్ఞను డాన్స్, ఫైట్స్, డైలాగ్స్, నటనలో శిక్షణ ఇప్పించాడు కూడా.

త్వరలో మోక్షు సినీ హీరోగా ఎంట్రీ ఇవ్వడం పక్కా అని చెబుతున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 29 యేళ్లు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్‌ వంటి హీరోలు స్టార్స్‌గా సత్తా చూపెట్టారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికీ ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది పరిస్థితి. తాజాగా మోక్షు ఓ పంక్షన్‌లో కనిపించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో మోక్షజ్ఞ హాండ్సమ్ లుక్‌తో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసాడు. టాలీవుడ్‌లో బడా స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగానే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని నందమూరి కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.

బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109 చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీని ముందుగా వేసవి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. ఫైనల్‌గా ఈ సినిమాను ఆగష్టు లేదా దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

ఇదీ చదవండి: నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News