హైదరాబాద్: మీటూ ఉద్యమంలో యాక్టీవ్ గా పాల్గొంటున్న తెలుగు హీరోయిన్ అక్కినేని సమంత..లైంగిక వేధింపులకు గురైన మహిళలకు అండగా నిలుస్తోంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చింది. బయటికి వచ్చిన వారికి తన మద్దతు ఉంటుందని సమంత పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఆమె మాట్లలో చెప్పాలంటే... ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీ వాయిస్ తెలపండి. మీరోవరో చెప్పకపోయినా సరే.. మీరిచ్చిన వాయిస్ ప్రపంచానికి వినిపిస్తుంది.'' అని మహిళలకు సమంత పిలుపునిచ్చింది.
Speak up against sexual harassment
Your voice will be heard even if it is anonymous Complain to -
complaints@telugufilmchamber.in
complaints@apfilmchamber.com
Postal address
Panel against sexual harassment
Dr D Ramanaidu Building
Filmnagar Hyderabad
TELANGANA 500096 #MeToo pic.twitter.com/iDz02nnJ4c
— Samantha Akkineni (@Samanthaprabhu2) October 14, 2018
హాలీవుడ్‌లో మొదలైన ‘మీటూ’ ఉద్యమం క్రమంగా అన్ని రంగాల్లో విస్తరించింది. మీటూ ఉద్యమంలో భాగంగా మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపులను ధైర్యంగా తెలుపుతూ సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుండి పులువురు ప్రముఖుల పేర్లు బయటపెడుతున్నారు. మహిళ జర్నిలిస్టులు కూడా ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఓ జర్నలిస్టు ధైర్యంగా వచ్చి ఏకంగా కేంద్రమంత్రిపైనే ఆరోపణలు సంధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమంత కూడా ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించడం గమనార్హం