IND vs ENG 3rd Test Live, Day 3 : రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు 319 పరుగులకు కుప్పకూలింది. లంచ్ తర్వాత పేసర్ సిరాజ్ చెలరేగడంతో ఆ జట్టు అనుహ్యంగా కుప్పకూలింది. దాంతో టీమిండియాకు 128 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
290/ 5తో లంచ్ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన స్టోక్స్ సేన కేవలం 29 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. లంచ్ తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్(41)ను జడేజా ఔట్ చేయగా..బెన్ ఫోక్స్(13)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. రెహ్మాన్, అండర్సన్ ను సిరాజ్, హార్ట్లేను జడేజా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ నాలుగు, కుల్ దీప్, జడేజా రెండేసి వికెట్లు తీశారు. ప్రస్తుతం టీమిండియా 33 ఓవర్లో 139 పరుగులు చేసింది.
Also Read: Ravichandran Ashwin: 500 వికెట్ల క్లబ్ లో అశ్విన్.. దిగ్గజాల సరసన చోటు..
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు మెరుపు ఆరంభాన్నిచ్చారు జైస్వాల్, రోహిత్. ముఖ్యంగా జైస్వాల్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. రోహిత్ 19 పరుగులకే ఔటైన.. యశస్వి తన దూకుడును మాత్రం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఇతడికి గిల్ మంచి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 35 ఓవర్లలో 142 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ సేన 268 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read: IND vs ENG 3rd Test live: టీమిండియాకు దీటుగా బదులిస్తున్న స్టోక్స్ సేన.. దంచికొట్టిన డకెట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter