/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Mahi V Raghava

మహీ వీ రాఘవ తెరకెక్కించిన ‘యాత్ర 2’ ఇటీవల విడుదలైంది. కాగా ఈ చిత్రం తీసిన దానికి మ‌ద‌న‌ప‌ల్లిలోని హ‌ర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్ర‌భుత్వం... మ‌హి వి.రాఘ‌వ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెక‌రాలు భూమి ఇచ్చిందంటూ ఓ వ‌ర్గానికి చెందిన మీడియాలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మ‌హి.వి.రాఘ‌వ్ స్పందించారు. 

మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ ..‘‘నిజంగానే నాకు.. నా ప్రాంతానికి ఏదో చేయాల‌నే ఆశ లేక‌పోతే, నేను హైద‌రాబాద్‌లోనో, వైజాగ్‌లోనో స్టూడియో క‌ట్టుకోవటానికి స్థ‌లం కావాల‌ని అడుగుతాను. అంతేకానీ వెనుక‌బ‌డిన ప్రాంతంగా చూసే మ‌ద‌న‌ప‌ల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటున్నాను.. ఈ విషయం ఎందుకు ఎవరూ ఆలోచించడం లేదు’’ అని అంటున్నారు దర్శక నిర్మాత మహి వి.రాఘవ్. 

‘‘నేను రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఇండ‌స్ట్రీలో 16 ఏళ్లుగా ఉంటున్నాను. 2008లో సినీ పరిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టాను. సినిమా ఇండస్ట్రీకి మూన్ 3 ఆట‌మ్ లీవ్స్, వాట‌ర్ పిక్చర్స్ అనే రెండు నిర్మాణ సంస్థ‌ల‌ను స్థాపించాను. విలేజ్‌లో వినాయ‌కుడు, కుదిరితే క‌ప్పు కాఫీ, పాఠ‌శాల‌, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర‌, సిద్ధా లోకం ఎలా ఉంది, యాత్ర 2 సినిమాల‌ను .. అలాగే సేవ్ ది టైగ‌ర్స్‌, సైతాన్ అనే వెబ్ సిరీస్‌ల‌ను తీశాను. నేను రాయ‌ల‌సీమ ప్రాంతంలోని మ‌ద‌న‌ప‌ల్లిలోనే పుట్టి పెరిగాను.. నా చదువు అంతా అక్కడే సాగింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో రాయ‌ల‌సీమ ప్రాంతానికి పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌దు. అంటే అక్క‌డ షూటింగ్స్ చేయ‌టానికి ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌రు. నా ప్రాజెక్ట్స్‌లో ఆనందో బ్ర‌హ్మ‌,  సేవ్ ది టైగ‌ర్స్ అనే వెబ్ సిరీస్‌లను రాయలసీమలో తెరకెక్కించలేదు. పాఠ‌శాల‌, యాత్ర 2, సిద్ధా లోక‌మెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ రాయ‌ల‌సీమ‌లోనే చిత్రీక‌రించాను” అని చెప్పుకొచ్చారు. 

“మ‌రీ ముఖ్యంగా ఈ రెండేళ్లలో సైతాన్, యాత్ర 2, సిద్ధాలోకం అనే మూడు ప్రాజెక్ట్స్‌ను మ‌ద‌న‌ప‌ల్లి, క‌డ‌ప ప్రాంతాల్లో రూపొందించాం. మూడు ప్రాజెక్ట్స్‌కి దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేశాను. అందుకు కార‌ణం నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాల‌నే ఉద్దేశమే. అందుకోసమే నేను సంపాదించిన డ‌బ్బుని అక్క‌డ ఖ‌ర్చు పెట్టాను. అక్క‌డ సినిమాలు చేయ‌టం వ‌ల్ల అక్కడి హోటల్స్, లాడ్జీలు, భోజ‌నాలు, జూనియ‌ర్స్ ఇలా పలు రకాలుగా స్థానికులు ఉపయోగం ఉంటుందని భావించాను.  ఈ జ‌ర్నీలో నేను వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయ‌ల‌సీమ‌లో మినీ స్టూడియో నిర్మించాల‌నుకున్నాను.  బుద్ధి ఉన్నోడెవ‌డైనా దీన్ని ఆలోచించాలి. నేనేమీ స్టూడియో నిర్మాణం కోసం యాబై, వంద ఎక‌రాలు అడ‌గ‌లేదు. నేను కేవ‌లం రెండు ఎక‌రాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాల‌నుకున్నాను.  దాని వ‌ల్ల అక్క‌డెవ‌రైనా షూటింగ్స్ చేసుకోవాల‌నుకుంటే అంద‌రికీ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది” అని తన ఉద్దేశాన్ని బయటపెట్టారు. 

“ఇన్నేళ్లు ఇండ‌స్ట్రీ ఉంటుంది క‌దా, రాయ‌ల‌సీమ‌కు ఎవ‌డైనా ఏమైనా చేశారా! ఎవ‌రూ ఏమీ చేయ‌లేదు. మీరు చేయ‌రు... చేసేవాడిని చెయ్య‌నియ్య‌రు. ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించ‌లేదు. వాళ్ల‌కి ప్రియ‌మైన ప్ర‌భుత్వం ఎవ‌రెవ‌రికీ భూముల‌ను ఎక్క‌డెక్క‌డిచ్చింది..  వాళ్ల‌కు న‌చ్చిన‌వాళ్ల‌కు, ఇష్ట‌మైన వాళ్ల‌కు భూముల‌ను ఇచ్చుకుంది. వీటి గురించి ఎవ‌రూ మాట్లాడ‌రు. నేను నా ప్రాంతంలో కేవ‌లం రెండు ఎకరాల్లో, అక్క‌డి ప్ర‌జల‌కు ఉప‌యోగ‌ప‌డే ఉద్దేశంతో మినీ స్టూడియో క‌ట్టాలని అనుకుంటే మాత్రం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు’’ అని అన్నారు.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Mahi V Raghava comments on Telugu film industry make heads turn vn
News Source: 
Home Title: 

‘సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది’..మ‌హి వి.రాఘ‌వ్‌ సెన్సేషనల్ కామెంట్స్

Mahi V Raghava: ‘సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది’..మ‌హి వి.రాఘ‌వ్‌ సెన్సేషనల్ కామెంట్స్
Caption: 
Mahi V Raghava (source:FILE)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
‘సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది’..మ‌హి వి.రాఘ‌వ్‌ సెన్సేషనల్ కామెంట్స్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, February 12, 2024 - 16:47
Created By: 
Vishnupriya Chowdhary
Updated By: 
Vishnupriya Chowdhary
Published By: 
Vishnupriya Chowdhary
Request Count: 
20
Is Breaking News: 
No
Word Count: 
399