AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి 2014 రిపీట్ కానుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం-జనసేన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీను కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపైనే స్పష్టత రావల్సి ఉంది.
ఏపీలోని 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా తెలుగుదేశం-జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతున్నాయి. ఇదే కూటమిలో బీజేపీను చేర్చుకుని 2014 రిపీట్ చేయాలనేది ఆలోచనగా ఉంది. జనసేనకు 25 అసెంబ్లీ, 2-3 పార్లమెంట్ స్థానాలు దక్కవచ్చు. బీజేపీతో పొత్తు విషయమై ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు చర్చలు జరిపారు. అటు బీజేపీ అగ్ర నాయకత్వం సైతం ఏపీలో తెలుగుదేశం-జనసేనతో పొత్తు ఉంటుందనే సంకేతాలిస్తోంది. అయితే సీట్ల సర్దుబాటుపై అంగీకారం కుదిరితేనే పొత్తు ఉంటుందా లేదా అనేది అధికారికంగా ప్రకటన వెలువడవచ్చు. చంద్రబాబు తరువాత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల్ని కలవాల్సి ఉంది. కానీ ఈ పర్యటనకు బ్రేక్ పడింది.
ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ కానున్నారు. బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. జనసేన మాత్రం పొత్తులో భాగంగా 40 అసెంబ్లీ స్థానాలు కోరుతోంది. అటు పొత్తు కుదిరితే బీజేపీ 20 అసెంబ్లీ 5-6 పార్లమెంట్ స్థానాలు ఆశిస్తున్నట్టు సమాచారం. బీజేపీ పెద్దల్నించి ఇదే ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ మాత్రం జనసేన-బీజేపీలకు కలిపి 40 అసెంబ్లీ, 8-9 పార్లమెంట్ స్థానాలిచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
ఒకవేళ బీజేపీ, జనసేనలు కోరినట్టుగా సీట్లు ఇచ్చేదైతే తెలుగుదేశం 50-60 అసెంబ్లీ 10 పార్లమెంట్ స్థానాలకు కోల్పోవల్సి వస్తుంది. ఇక తెలుగుదేశంకు మిగిలేది కేవలం 15 పార్లమెంట్, 110-125 అసెంబ్లీ సీట్లు మిగులుతాయి. ఫలితంగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతల్నించి వ్యతిరేకత రావచ్చు.
Also read: Qatar government: ఆ 8 మందికి క్షమాభిక్ష, విడుదల చేసిన ఖతార్ దేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP Elections 2024: పొత్తు ఖాయమేనా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో ఎవరికెన్ని సీట్లు