Lottery: పిల్లల పేర్లతో నాన్నకు వరించిన అదృష్టం.. రూ.33 కోట్ల లాటరీ సొంతం

Big Jackpot: పిల్లలే తమ భవిష్యత్‌ వారి తల్లిదండ్రులు భావిస్తారు. కష్టపడేదంతా వారికోసం. అలాంటి పిల్లల పేరు మీద ఓ తండ్రి లాటరీ టికెట్‌ కొనగా జాక్‌పాట్‌ తగిలింది. పిల్లల పేరుతో అతడికి అదృష్టం వరించింది

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 10, 2024, 11:11 PM IST
Lottery: పిల్లల పేర్లతో నాన్నకు వరించిన అదృష్టం.. రూ.33 కోట్ల లాటరీ సొంతం

UAE Lottery: సరదాగా పిల్లల పేరు లాటరీ టికెట్‌ కొన్న ఓ భారతీయుడికి దుబాయ్‌లో అదృష్టం వరించింది. అతడు కొన్న టికెట్‌కే లాటరీ తగలడంతో ఆ తండ్రి ఆనందం అంతాఇంతా కాదు. రూ.33 కోట్ల నగదు అతడి సొంతమైంది. కొన్నేళ్లుగా ఇలా లాటరీ టికెట్‌ కొంటున్నా లాభం లేదు. ఎప్పుడూ లాటరీ తగలలేదు. ఈసారి పిల్లల పేరు మీద టికెట్‌ కొందామని భావించి తీసుకోగా వాటికే లాటరీ తగలడంతో ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నాడు. 

Also Read: AP Elections: ఏపీలో సినీ ప్రముఖుల ప్రచారం.. ఫలితాలపై జోష్యం చెప్పిన 'థర్టీ ఈయర్స్‌ ఇండస్ట్రీ' పృథ్వీ

కేరళకు చెందిన రాజీవ్‌ అరిక్కట్‌ యూఏఈ (దుబాయ్‌)లో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో అక్కడే నివసిస్తున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు. రాజీవ్‌కు లాటరీ టికెట్లు కొనడం బాగా అలవాటు. మూడేళ్లుగా టికెట్లు కొంటున్నా అదృష్టం వరించడం లేదు. పిల్లల పుట్టినరోజు తేదీలైన నంబర్లను అతడు కొన్నాడు. ఆ విధంగా పిల్లల పేర్లతో లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఫలితం కోసం ఎదురుచూస్తుండగా ఇటీవల అతడికి లాటరీ నిర్వాహకులు సమాచారం అందించారు. అబుదాబి బిగ్‌ టికెట్‌ వీక్లీ డ్రాలో రాజీవ్‌ తీసిన టికెట్‌కు లాటరీ తగిలింది. ఈ లాటరీ గెలవడంతో అతడికి 15 మిలియన్ల దిర్హామ్స్‌ (రూ.33 కోట్లు) దక్కనున్నాయి.

Also Read: Honey Trap: సింగోటం హత్యకేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఇది తల్లీకూతురు నడిపే 'క్రైమ్ కథా చిత్రం'

టికెట్‌ గెలుపొందిన అనంతరం రాజీవ్‌ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు. 'బిగ్‌ టికెట్‌పై ఈసారి ప్రత్యేక ఆఫర్‌ వచ్చింది. నేను రెండు టికెట్లు కొన్నాను. ఆఫర్‌ కింద వాళ్లు నాలుగు టికెట్లు ఉచితంగా ఇచ్చారు. ఈసారి మొత్తం ఆరు టికెట్ల ఉండడంతో లాటరీ ఎలాగైనా తగులుతుందనే నమ్మకంతో ఉన్నా. ప్రతిసారి లాటరీ తగులుతుందనే నమ్మకంతోనే ఉంటాను. కానీ ఈసారి టికెట్లు ఎక్కువ ఉండడంతో ఎలాగైనా లాటరీ గెలుస్తానని భావించా. నేను, నా భార్య కలిసి 7, 13 నంబర్‌తో ఉన్న టికెట్లు కొన్నాం. అవి నా పిల్లల పుట్టినరోజు తేదీలు' అంటూ రాజీవ్‌ చెప్పుకొచ్చాడు.

'లాటరీ టికెట్‌లో తీరా మాకు ఉచితంగా వచ్చిన టికెట్‌కు లాటరీ తగిలింది. మూడేళ్లలో తొలిసారి నాకు అదృష్టం కలిసివచ్చింది. లాటరీ తగిలిందని చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది. అది మాటల్లో చెప్పలేను. నాతోపాటు మా కుటుంబం జీవితాన్ని మార్చింది' అని రాజీవ్‌ అర్కిట్ తెలిపాడు. ఇక వచ్చిన లాటరీ డబ్బులు రూ.33 కోట్లు ఎలా ఖర్చు చేస్తావనే విషయంపై ప్రశ్నించగా తాను ఇప్పుడే ఏం నిర్ణయించుకోలేదని చెప్పాడు. ఆ డబ్బును మరో 19 మందితో సమానంగా పంచుకోవాలనుకుంటున్నట్లు రాజీవ్‌ తెలిపాడు. రాజీవ్‌ కుటుంబం పదేళ్లుగా దుబాయ్‌లోనివసిస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News