How To Book Bharat Rice Online: దేశంలో సన్నబియ్యానికే డిమాండ్ ఎక్కువ. అందుకే ఆ బియ్యం ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. కిలో బియ్యం 50 రూపాయలు దాటేసింది. దాంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో సరికొత్త పధకాన్ని ప్రారంభించింది.
కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రైస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పధకం కింద నాణ్యమైన సన్న బియ్యాన్ని కిలో 29 రూపాయలకే అందించనున్నారు. దేశీయ మార్కెట్‌లో సన్న బియ్యం సహా నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టొమాటో విక్రయించిన కేంద్ర ప్రభుత్వ భారత్ ఆటాను గత ఏడాది నవంబర్ 6 నుంచి మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. బయటి మార్కెట్‌లో కిలో ఆటా 35 రూపాయలుంటే..కేంద్ర ప్రభుత్వం 27.50 రూపాయలకే ఇస్తోంది. ఇప్పుడు తాజాగా భారత్ రైస్ పేరుతో సన్న బియ్యం విక్రయాలు ప్రారంభించింది.
భారత్ రైస్ ఎక్కడ దొరుకుతుంది (How To Book Bharat Rice Online)
భారత్ రైస్ ఇవాళ్టి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ సహా అన్ని చైన్ రిటైల్స్‌లో లభించనుంది. కిలో 29 రూపాయలకు లభించే ఈ బియ్యం 5,10 కిలోల ప్యాక్‌తో లభిస్తుంది. మొదటి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య అంటే నాఫెడ్, రెండవది జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య అంటే ఎన్‌సీసీఎఫ్‌లలో లభించనుంది. బహిరంగ మార్కెట్‌లో అప్పుడే లభించకపోవచ్చు. లేదా నాఫెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nafedbazar.com/product-tag/online-shopping ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో పప్పులు, చక్కెర, గోధుమ పిండి, ఉల్లిపాయలు, టొమాటో కూడా అందుబాటులో ఉంటాయి.
నాఫెడ్‌లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత మీ చిరునామా ఇతర వివరాలు నమోదు చేసి అప్పుడు ఆర్డర్ చేసుకోవాలి.
Also read: White lung Pneumonia: ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయవద్దు, వైట్ లంగ్ నిమోనియా కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook