/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Budget 2024 Expectations: మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశం కనిపిస్తోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓటర్లను ఆకర్షించే పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉంది. రేపు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతుల నుంచి ఉద్యోగుల వరకు అందరినీ ఆకట్టుకునే ప్రజాకర్షక ప్రకటనలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటును మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించవచ్చని నమ్మకంతో ఉన్నారు.  

ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ వేతన సంఘం ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచుతోంది. 28 ఫిబ్రవరి 2014న జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ అధ్యక్షతన 7వ వేతన సంఘం ఏర్పాటుగా.. జనవరి 1, 2016 నుంచి అమలు చేసిన కమిటీ సిఫార్సులు అమలులోకి వచ్చాయి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వ ప్రకటన ఉంటుందా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదని పార్లమెంటులో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం తరువాత 8వ వేతన సంఘం చైర్మన్, సభ్యుల పేర్లను ప్రభుత్వం ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం 28 ఫిబ్రవరి 2014న ఏడవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. జనవరి 1, 2016న కమిషన్ సిఫార్సుల ఆధారంగా జీతం, భత్యాలు, పెన్షన్‌లను పెంచుతూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరోవైపు డీఏ పెంపుపై ప్రకటన ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం 46 శాతం డీఏ అందుతుండగా.. మరోసారి 4 శాతం పెంచే అవకాశం ఉంది. దీంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరే అవకాశం ఉంటుంది. డిసెంబర్ నెలకు AICPI ఇండెక్స్ డేటా విడుదలైతే డీఏ పెంపుపై క్లారిటీ రానుంది.

Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ

Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo

Section: 
English Title: 
Budget 2024 Latest Updates Central Govt Employees Get Good News in budget on 8th pay Commission before loksabha elections
News Source: 
Home Title: 

8th Pay Commission: బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్..? ఆ ప్రకటన వస్తే పండగే..!

8th Pay Commission: బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్..? ఆ ప్రకటన వస్తే పండగే..!
Caption: 
8th Pay Commission (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్..? ఆ ప్రకటన వస్తే పండగే..!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, January 31, 2024 - 18:27
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
84
Is Breaking News: 
No
Word Count: 
292