Dream Meaning: మీకు రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఏదో కల వచ్చి ఉంటుంది. చాలామందికి ఉదయాన్నే ఆ కలను గుర్తుంచుకుంటారు, చాలా మంది కలను మరచిపోతారు. స్వప్నశాస్త్రం ప్రకారం మీకు కలలో నల్లకుక్క కనిపిస్తే ఏ సంకేతాలను ఇస్తుందో ఈ రోజు తెలుసుకుందాం. సాధారణంగా నల్ల కుక్క అంటే కాలభైరవుని వాహనం. మీరు విపరీత ఆర్థిక కష్టాలతో బాధపడుతుంటే కష్టాలను తొలగించుకోవడానికి పాలు, నల్ల నువ్వుల లడ్డు అనేక ఇతర వస్తువులను నల్ల కుక్కకు తినిపించండి.
1. ఒకవేళ మీకు కలలో కుక్క మీపై దూసుకువచ్చినా, మిమ్మల్ని కరిచినా మీరు ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని అర్థం. అయితే, ఇది మీకు శుభ సూచకం కాదు. ఇది చెడును సూచిస్తుంది. మీరు జాగ్రత్తపడాల్సి ఉంటుంది.
2. మీకు కలలో పిచ్చి కుక్క కనిపించినట్లయితే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడతారని అర్థం. మిమ్మల్ని ఆర్థిక సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఈ కల అర్థం. ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. గ్రంథాల ప్రకారం కలలో పిచ్చి కుక్కను చూడటం అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది.
3. స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వేళ మీరు కలలో మీ పెంపుడు కుక్కును చూస్తే ఆ కల శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు. మీ పనిచేసే ప్రదేశం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ప్రస్తుతానికి ఎదుర్కోరు. ఇది మీలో సానుకూల శక్తిని నింపుతుంది.
4. అంతేకాదు, ఒకవేళ మీరు కలలో నల్లకుక్కను చూస్తే త్వరలో మీకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీరు మీ ప్రత్యేక స్నేహితుడిని కూడా కలిసే అవకాశం ఉంది. మీకు కలలో నల్ల కుక్క కనిపిస్తే అది శుభ సంకేతం. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)
ఇదీ చదవండి: Laughing Buddha: లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఈ దిక్కున పెడితే ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది..
ఇదీ చదవండి: Solar Eclipse 2024: మొదటి సూర్యగ్రహణం 2024 ఏ రోజు రానుంది?.. భారతదేశంపై ప్రభావం ఉంటుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook