ICC Under 19 World Cup 2024: అండర్ – 19 వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ స్టేజ్‌లో ఇరగదీసిన యువ భారత్.. సూపర్ సిక్స్ లో కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఇవాళ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ తేడాతో కివీస్ ను ఓడించింది యంగ్ ఇండియా. ఈ విజయంతో భారత్ సూపర్ సిక్స్ స్టేజ్‌లో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్ 295 పరుగులు చేసింది. భారత బ్యాటర్ ముషీర్ ఖాన్ (131) మరోసారి సెంచరీతో చెలరేగాడు. ఆదర్శ సింగ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఉదయ్ సహారణ్ కూడా రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసెన్ క్లర్క్ నాలుగు వికెట్లు తీశాడు.
Also Read: Jay Shah: ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ చేయనున్న జై షా.. అందుకోసం ఏకంగా?
అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 81 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ను స్పిన్నర్ సౌమి పాండే దెబ్బతీశాడు.అతడు నాలుగు వికెట్లుతో కివీస్ వెన్నువిరిచాడు. ఆ జట్టు బ్యాటర్లలో కనీసం ఎవరూ కూడా 20 పరుగుల స్కోరును దాటలేకపోయారు. కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుమింగ్ 16, థాంప్సన్ 12 పరుగులు చేశారు. బ్లాక్ క్యాప్స్ జట్టులో నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే ఔటవ్వగా.. ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముషీర్ ఖాన్ కూడా బౌలింగ్‌లో కూడా రాణించాడు. అతడు రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో భారత్ తమ తర్వాత మ్యాచ్‌ను ఫిబ్రవరి 2న నేపాల్‌తో ఆడనుంది.
Also Read: Chiranjeevi: మెగాస్టార్ కు జెర్సీ కానుకగా ఇచ్చిన కేఎస్ భరత్.. ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి