February 2024 Bank Holidays: ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఏకంగా 11 రోజులు సెలవులున్నాయి. ఈ ఏడాది లీప్ సంవత్సరం కావడంతో 29 రోజుల్లో 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. అందుకే బ్యాంకు పనులుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఫిబ్రవరి నెలలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవుందో తెలుసుకుందాం..
ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల బాబితా విడుదల చేస్తుంటుంది. వచ్చే నెల ఫిబ్రవరి సెలవుల జాబితా వచ్చేసింది. ఇందులో కొన్ని జాతీయ సెలవులుంటే మరి కొన్ని ప్రాంతీయ సెలవులున్నాయి. అందుకే అన్ని ప్రాంతాల్లోనూ ఈ సెలవులు ఒకేలా ఉండకపోవచ్చు. ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తున్నా..ఆన్లైన్ లావాదేవీలే ఎక్కువగా కన్పిస్తున్నా కొన్ని పనులకు మాత్రం బ్యాంకుకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే బ్యాంకుల సెలవులు తెలుసుకోవాలి.
ఫిబ్రవరి 4 ఆదివారం సెలవు
ఫిబ్రవరి 10 రెండవ శనివారం సెలవు
ఫిబ్రవరి 11 ఆదివారం సెలవు
ఫిబ్రవరి 14 వసంత పంచమి త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సెలవు
ఫిబ్రవరి15 మణిపూర్ రాష్ట్రంలో సెలవు
ఫిబ్రవరి 19 ఛత్రిపతి శివాజీ జయంతి మహారాష్ట్రలో సెలవు
ఫిబ్రవరి 20 రాష్ట్ర అవతరణ దినోత్సవం అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో సెలవు
ఫిబ్రవరి 24 నాలుగవ శనివారం
ఫిబ్రవరి 25 ఆదివారం సెలవు
ఫిబ్రవరి 26 న్యూకుమ్ పర్వదినం అరుణాచల్ ప్రదేశ్ సెలవు
ఫిబ్రవరి నెలలో 11 రోజులపాటు బ్యాంకులకు సెలవులున్నా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, ఏటీఎం సేవలు కొనసాగనున్నాయి.
Also read: AP Government: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, త్వరలో ఏపీ టెట్ నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook