Redmi Note 13 Pro New Year Special Edition: ప్రముఖ టెక్ కంపెనీ Redmi చైనాలో Redmi Note 13 Pro న్యూ ఇయర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం లుక్‌తో పాటు రెడ్ కలర్‌లో మార్కెట్‌లోకి విడుదలైంది. అయితే కంపెనీ ఈ మొబైల్‌ను కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే విడుదల చేసినట్ల సమాచారం. ఈ ఎడిషన్‌కి సంబంధించిన స్మార్ట్ ఫోన్ విక్రయాలను కంపెనీ ఇప్పటికే చైనాలో ప్రారంభించింది. అయితే ఈ వేరియంట్‌ను ధర రూ. 16,500లతో అందుబాటులో తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ Redmi Note 13 Pro న్యూ ఇయర్ స్పెషల్ ఎడిషన్ కూడా సాధరణ మొబైల్ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే కంపెనీ అదనంగా కేవలం డిజైన్‌తో పాటు రంగులను మార్చిన్నట్లు కొందరు టిప్‌స్టర్స్ తెలిపారు. ఈ స్పెషల్ ఎడిషన్ వెర్షన్ రెడ్ కలర్ రియర్ ప్యానెల్, బ్లాక్ ఫ్రేమ్‌ని కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేక థీమ్, వాల్‌పేపర్, రింగ్‌టోన్‌తో వచ్చింది.
కొత్త వేరియంట్ ధర:
ఈ Redmi Note 13 Pro కొత్త వేరియంట్ ర్యామ్, స్టోరేజ్, ఐదు వేర్వేరు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి వచ్చింది. చైనాలో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ధర 1,399 యువాన్లు (రూ. 16,500) కాగా..8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర 1,499 యువాన్లు (రూ. 17,500)గా ఉంది. ఇక 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లపై ధర అదనంగా రూ. 1,699తో అందుబాటులో ఉంది. 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర 1,899 యువాన్ (రూ. 22,500)తో లభిస్తోంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
Redmi Note 13 Pro ఫీచర్స్:
ఈ కొత్త వేరియంట్ Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 1920 Hz PWM డిమ్మింగ్ స్పెషిఫికేసన్స్‌తో లభిస్తోంది. దీని డిస్‌ప్లే 1800 nits వరకు బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది MIUI 14 ఆధారంగా Android 13పై రన్ అవుతుంది.
ఇతర ఫీచర్స్:
16 మెగాపిక్సెల్సెల్ఫీకెమెరా
OISతో 200-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా
2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా
67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5100mAh బ్యాటరీ
IR బ్లాస్టర్, IP54 రేటింగ్
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Redmi Note 13 Pro New Edition: Redmi నుంచి న్యూ ఇయర్ ఎడిషన్ మొబైల్..ప్రత్యేకమైన డిజైన్‌తో పిచ్చెక్కిస్తోంది!