TSRTC Recruitment 2024: నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల్లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి టీఎస్‌ఆర్‌టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీ అర్హత ఉండాలి. అంతేకాకుండా అప్లై చేసేవారు 2018 నుంచి 2023 మధ్య బ్యాచ్‌ల వారు అయిండాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీల భర్తీలో రిజర్వేషన్లను అమల్లో ఉంది. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtc.telangana.gov.in ని చూడండి.
నోటిఫికేషన్ వివరాలు:
మెుత్తం పోస్టులు- 150
పోస్టు- నాన్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్
అర్హత- బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు- 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ పీరియడ్: మూడేండ్లు
జీతం- మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000 స్టైఫండ్ చెల్లిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరి తేదీ: ఫిబ్రవరి 16
వెబ్‌సైట్: https://www.tsrtc.telangana.gov.in
రీజియన్ల వారీగా ఖాళీలు..
1. హైదరాబాద్ రీజియన్- 26
2. సికింద్రాబాద్ రీజియన్- 18
3. మహబూబ్ నగర్ రీజియన్- 14
4. మెదక్ రీజియన్- 12
5. నల్గొండ రీజియన్- 12
6. రంగారెడ్డి రీజియన్- 12
7. ఆదిలాబాద్ రీజియన్- 09
8. కరీంనగర్ రీజియన్- 15
9. ఖమ్మం రీజియన్- 09
10. నిజామాబాద్ రీజియన్- 09
11. వరంగల్ రీజియన్- 14
Also Read: BRS MLAs: సీఎంను కలిస్తే తప్పేంటి..? కాంగ్రెస్‌లో చేరికపై నలుగురు ఎమ్మెల్యేలు క్లారిటీ
Also Read: New Ration Card Application Form: కొత్త రేషన్ కార్డులకు లైన్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook