Multibagger Stocks: లక్ష రూపాయల పెట్టుబడిని 10 నెలల్లో 15 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే

Multibagger Stocks: షేర్ మార్కెట్ అంతుచిక్కని వ్యాపారం. ఎప్పుడు లాభాలు కురిపిస్తుందో..ఎప్పుడు ముంచుతుందో ఊహించలేం. అందుకే నిశిత పరిశీలన కచ్చితంగా ఉండాలి. చాలా సందర్భాల్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ ఊహించని లాభాలు ఆర్జించి పెడుతుంటాయి. అలాంటిదే ఇది..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 21, 2024, 09:27 AM IST
Multibagger Stocks: లక్ష రూపాయల పెట్టుబడిని 10 నెలల్లో 15 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే

Multibagger Stocks: స్వల్పకాలంలో లాభాలు ఆర్జించే చిన్న చిన్న షేర్లను పెన్నీ స్టాక్స్ అంటారు. అదృష్టం ఉంటే దశ తిరిగిపోతుంటుంది. ఎందుకంటే ఈ పెన్నీ స్టాక్స్ చాలా సందర్బాల్లో చాలామందిని లక్షాధికారుల్ని చేస్తుంటాయి. అదే విధంగా 9 రూపాయల అతి చిన్న స్టాక్ లక్షలు కురిపించింది. ఆశ్చర్యంగా ఉందా..

షేర్ మార్కెట్‌పై ఎప్పుడూ నిశిత పరిశీలన, నిరంతర అధ్యయనం ఉండాలి. అప్పుడే అందులో పెట్టే పెట్టుబడులతో రాణించగలం. గత ఏడాది అంటే 2023లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌కు మంచి లాభాలు వచ్చిపడ్డాయి. అందులో ఒకటి సీనిక్ ఎక్స్‌పోర్ట్స్, కేవలం 9 రూపాయలున్నషేర్ ఇన్వెస్టర్లకు లక్షలు కురిపించింది. అది కూడా కేవలం ఏడాది వ్యవధిలో. సరిగ్గా 10 నెలల క్రితం సీనిక్ ఎక్స్‌పోర్ట్స్ షేర్ విలువ 9 రూపాయలుంది. ఇప్పుడు అదే షేర్ 150 రూపాయలు దాటేసింది. అంటే ఇన్వె,స్టర్లకు ఏకంగా 1450 శాతం లాభాన్నిచ్చింది. అంటే పది నెలల క్రితం లక్ష రూపాయలతో షేర్లు కొంటే...అవి కాస్తా ఇప్పుడు  15.50 లక్షలయ్యాయి. 

2023 ఏప్రిల్ నెలలో ఈ స్టాక్ 52 వారాల కనిష్ట విలువ 9.76 రూపాయలు మాత్రమే. ఆ తరువాత క్రమంగా పెరుగుదల నమోదవుతూ వచ్చింది. సెప్టెంబర్ నాటికి 103 శాతం పెరిగింది. నవంబర్ నాటికి మరో 51 శాతం పెరిగింది. ఇలా ప్రతి నెలా పెరుగుతూ వచ్చింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి వరకూ 1174 శాతం పెరిగింది. సీనిక్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ భారీగా నష్టం చవిచూసింది 2023 జనవరి నెలలో. అంటే ఏడాది క్రితం 40 శాతం నష్టం ఎదురైంది. ఈ ఏడాది జనవరి నాటికి 1440 శాతం లాభాల్లో ఉంది. ఊహించని లాభాలంటే ఇవే మరి. 

అందుకే పది నెలల క్రితం 9 రూపాయల షేర్ విలువతో లక్ష రూపాయల పెట్టుబడి కాస్తా ఇప్పుడు 15 లక్షలైంది. సీనిక్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ త్రైమాసిక లాభాలు కూడా బాగున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో 1.09 కోట్లు ఆర్జించింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికానికి 21 లక్షలు మాత్రమే. షేర్ మార్కెట్‌లో అదృష్టం పరీక్షించుకోవాలంటే నిశిత పరిశీలన, నిరంతర అధ్యయనంతో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. 

Also read: Vivo G2 5G Launch: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్, అద్బుత ఫీచర్లతో బడ్జెట్ ఫోన్, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News