Black Pepper Benefits: నల్ల మిరియాలను ఎక్కువగా మనం వంటల్లో వాడుతూ ఉంటాము. ఈ నల్ల మిరియాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నల్ల మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే నల్ల మిరియాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
▶ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో నల్ల మిరియాల ఆయిల్ కలిపి తీసుకోవడం వల్ల బరువు సమస్యను తగ్గించుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
▶ నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల ఫ్యాట్ సెల్స్‌ను పెంచకుండా ఉంటుంది.
▶ ఈ నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె ఎక్కువగా లభిస్తాయి.
Also read: Sankranthi Muggulu 2024: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా ఇంటి ముందు వేసుకోవాల్సిన 7 ముగ్గులు..
▶ అంతేకాకుండా నల్ల మిరియాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే మెటబాలిజం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
▶ సలాడ్స్‌పైన నల్ల మిరియాల పొడిని కలిపి తింటే శరీర రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
▶ మిరియాల పొడిని టీలో వేసుకుని తాగుతుంటే గొంతులో నొప్పి, గరగర నుంచి ఉపశమనం పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Black Pepper: నల్ల మిరియాల వల్ల ఎన్నో ఉపయోగాలు..తప్పక తెలుసుకోండి!