Black Sesame Seeds Benefits: భారతీయులు ఆహారాల రుచిని పెంచేందుకు వివిధ రకాల పోపు దినుసులను వినియోగిస్తారు. వీటిలో ముఖ్యమైన నువ్వులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే అందురూ తెల్ల నువ్వులను చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా నల్ల నువ్వులు చూశారా? తెల్ల నువ్వులతో పోలిస్తే..నల్ల నువ్వుల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
నల్ల నువ్వుల్లో కాల్షియం, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6, ఫైబర్, ఐరన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకుంటే మానసిక సమస్యల నుంచి ఉపశమనం ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా బిపి కూడా నియంత్రణలో ఉంటుంది. ఇవే కాకుండా శరీరానికి ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
నల్ల నువ్వులు తీసుకోవడం వల్ల శరీరానికి కాలిగే లాభాలు:
జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది:
చలికాలంలో జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. నల్ల నువ్వులలో ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
ఎముకల దృఢత్వం కోసం:
చలికాలంలో నల్ల నువ్వులు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఈ నువ్వుల్లో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా ఎముకల బోలు వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు కీళ్లు, ఎముకలలో నొప్పి నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్యలు దూరమవుతాయి.
మానసిక సమస్యలకు చెక్:
నల్ల నువ్వుల్లో విటమిన్ బి6, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter