Teacher Student Romantic Photoshoot Leak: స్టూడెంట్‌తో ఓ టీచర్ చేసిన రొమాంటిక్ ఫోటోషూట్ ఇంటర్నెట్లో రచ్చకెక్కింది. విద్యార్థితో కలిసి ముద్దులు పెట్టుకుంటూ తీసుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు, విద్యార్థికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. మురుగమల్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, 10వ తరగతి విద్యార్థితో 'ఎడ్యూకేషనల్ స్టడీ టూర్'లో ఫోటోషూట్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యారాయులిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో భారీ వైరల్ అయ్యాయి. టీచర్, విద్యార్థి ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం పిక్స్‌లో కనిపిస్తోంది. కుర్తా, ప్యాంటు ధరించిన విద్యార్థి.. టీచర్ చీరను లాగడం.. ఇతర సన్నిహిత చర్యల మధ్య ఆమెను ఎత్తుకుని ఫొటోలు తీసుకున్నారు. ఎడ్యూకేషనల్ టూర్లో విద్యార్థితో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలను టీచర్ తన మొబైల్ ఫోన్లో డాక్యుమెంట్ చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి..
Where are we heading as a society ?
Pictures and videos from a romantic photoshoot of a government school teacher with a Class 10 student in Karnataka's Murugamalla Chikkaballapur district, went viral, following which the student's parents filed complaint with the Block… pic.twitter.com/WviIHtOP3J
— Amit Singh Rajawat (@satya_AmitSingh) December 28, 2023
“సమాజంలో మనం ఎటువైపు వెళ్తున్నాం..? కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యారాలు, 10వ తరగతి విద్యార్థితో రొమాంటిక్ ఫోటోషూట్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి” అని రాజావత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని టీచర్‌తో గొడవపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేసి ప్రధానోపాధ్యాయురాలి తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి.. విచారణ జరిపించారు.
నెట్టింట కూడా కామెంట్ల వర్షం కురుస్తోంది. విద్యార్థి అమాయకుడేమి కాదని.. అతడిపై కూడా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఉపాధ్యారాయులు తన విద్యార్థికి ప్రేమ భంగిమలు వేయడంలో ఆచరణాత్మకంగా శిక్షణ ఇస్తున్నారు అంటూ మరొకరు కామెంట్ చేశారు. చర్యలు తీసుకోవాలంటే "ఇద్దరినీ శిక్షించాలి" అన్నారు. "ఉపాధ్యాయుడు మగవాడు.. విద్యార్థి స్త్రీ అయితే ఆ కోపాన్ని ఊహించండి" అని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. చాలా మంది టీచర్, విద్యార్థి ప్రవర్తనను 'అన్ ప్రొఫెషనల్' అని అంటున్నారు.
Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి