Ayodhya Rammandir Features: జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృగశిర నక్షత్రంలో మద్యాహ్నం బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ట చేయనున్నారు. రామాలయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
అయోధ్య రామాలయం నిర్మాణ ప్రత్యేకతలు ఇలా
అయోధ్య రామాలయాన్ని సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. ఈ ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులతో ఉంటే...ఎత్తు 161 అడుగులుంటుంది.
రామమందిరం మూడు అంతస్థుల్లో ఉంటుంది. ప్రతి అంతస్థు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 పిల్లర్లు, 44 గుమ్మాలుంటాయి.
ఆలయం గర్భగుడిలో బాల శ్రీరాముడి విగ్రహం మొదటి అంతస్థుల్లో ఉంటుంది. అదే శ్రీ రామదర్బార్ అవుతుంది.
రామమందిరంలో ఐదు మంటపాలుంటాయి. నృత్య మంటపం, రంగ మంటపం, సభా మంటపం, ప్రార్ధనా మంటపం, కీర్తన మంటపం
రామమందిరం పిల్లర్లు, గోడలపై దేవీ దేవతల విగ్రహాలు, చిత్రాలతో నిండిపోయి ఉంటుంది.
ఆలయం తూర్పు వైపు నుంచి 32 మెట్లు పైకెక్కితే సింఘ్ ద్వారముంటుంది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే భక్తుల సౌకర్యార్ధం ర్యాంపు, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది.
దీర్ఘ చతురస్రాకారంలోని గోడ పర్కోటా పొడవు 732 మీటర్లు, వెడల్పు 14 అడుగులుంటుంది. ఇది ఆలయం చుట్టూ ఉంటుంది.
రామమందిరం ప్రహారీ మూలల్లో నాలుగు మందిరాలుంటాయి. ఇవి సూర్యదేవుడు, దేవి భగవతి, గణేశ్, శివ మందిరాలుగా ఉంటాయి. ఉత్తరం వైపు అన్నపూర్ణ, దక్షిణం వైపు హనుమంతుడి మందిరాలుంటాయి.
ప్రాచీన చరిత్రకు గుర్తుగా మందిరం సమీపంలో చారిత్రాత్మక సీతాకూపం అనే బావి నిర్మాణముంటుంది.
శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, మాతా శబరి, దేవి అహల్య మందిరాలు నిర్మించే ప్రతిపాదన ఉంది.
ఆలయ ప్రాంగణంలోని సౌత్ వెస్ట్‌లో కుబేర్ తిల వద్ద శివుని ప్రాచీన మందిరాన్ని పునరుద్ధరించారు.
మొత్తం ఆలయంలో ఎక్కడా ఐరన్ ఉపయోగించకపోవడం విశేషం.
ఆలయం ఫౌండేషన్‌ను 14 మీటర్ల మందంతో రోలర్ కంపాక్టెడ్ కాంక్రీట్‌తో నిర్మించారు.
భూమిలోని తేమ నుంచి రక్షణ కోసం 21 అడుగుల ప్లింత్ ఉన్న గ్రానైట్ వినియోగించారు.
ఆలయం ప్రాంగణంలో మురుగు నీటి శుద్ధి కర్మాగారం, వాట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటాయి.
25 వేలమంది సామర్ధ్యంలో పిలిగ్రిమ్ ఫెసిలిటీ సెంటర్ ఉంటుంది. ఇందులో వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యం ఉంటాయి.
రామమందిరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నాన గదులు, వాష్‌రూమ్స్, వాష్ బేసిన్స్, పబ్లిక్ కుళాయిల వ్యవస్థ ఉంటుంది.
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ 70 ఎకరాల్లో పచ్చదనం ఉండేలా ఆలయ ప్రాంగణం ఉంటుంది.
Also read: Ayodhya Prasadam: అయోధ్య రామాలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదమేంటో తెలుసా, అదెలా ఉంటుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook