Asthma Remedies Without Inhaler: శీతాకాలంలో శ్వాస సంబంధితమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం వాతావరణ మార్పులు కారణంగా కఫం, శ్లేష్మం శరీరంలో చేరుతుంది. ముఖ్యంగా ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు దీని బారిన పడుతుంటారు. ఈ సమస్యతో ఉన్నవారు ఇన్హెలర్లను, మందులను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సమస్యను తగ్గు ముఖం పడువచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆస్తమా వ్యాధితో బాధపడే వారు ఈ చిట్కాలను ప్రయంతించండి..
>> ఆస్తమా సమస్య ఉన్నవారు ఎల్లప్పుడు గోరు వెచ్చని నీటిని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి.
>> ఈ సమస్యతో బాధపడేవారు చల్ల నీళ్లు కంటే వేడి నీటితో స్నానం చేయడం ఎంతో మేలు చేస్తుంది.
>> చలికాలంలో వచ్చే కఫం, శ్లేష్మం వల్ల శ్వాస సరిగా తీసుకోవడం కష్టం. అలాంటి సమయంలో వేడి నీళ్లుతో ఆవిరి తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.
Also read: Pimples: మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి!
>> ఉడికించిన ఆహారానికి బదులుగా మొలకెత్తిన గింజలను, జామ కాయ వంటి పండ్లను తీసుకోవడం వల్ల ఆస్తమానుంచి ఉపశమనం పొందవచ్చు.
>> ఉప్పు, పంచదార, బెల్లంతో చేసిన పదార్థాలను తీసుకోకపోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా చేయడం వల్ల చాలా సులభంగా ఆస్తమా నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Chapati Benefits: మీ డైట్లో చపాతీలను తీసుకుంటున్నారా ? అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook