Ayodhya Rammandir: రాముడిని కూడా లోక్‌సభ అభ్యర్ధిగా నిలబెడుతుందేమో, యూబీటీ శివసేన సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు

Ayodhya Rammandir: అయోధ్య రామమందిరం వ్యవహారంలో యూబీటీ శివసేన అధినేత సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 30, 2023, 01:35 PM IST
Ayodhya Rammandir: రాముడిని కూడా లోక్‌సభ అభ్యర్ధిగా నిలబెడుతుందేమో, యూబీటీ శివసేన సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు

Ayodhya Rammandir: మరి కొద్దిరోజుల్లో అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే శివసేన నేత సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిర ప్రారంభోత్సవం బీజేపీ ఈవెంట్‌గా ఆయన అభివర్ణించారు. 

జనవరి 22న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠకు వారం రోజుల ముందు నుంచే వివిధ కార్యక్రమాల్ని రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ రూపకల్పన చేసింది. జనవరి 17వ తేదీన బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకోనుంది. అదే రోజు సరయు నది నీళ్లను కలశంలో తీసుకొస్తారు. జనవరి 18న గణేశ్ పూజ ఉంటుంది. జనవరి 19వ తేదీన హోమం జరగనుంది. జనవరి 20వ తేదీన వాస్తు శాంతి, 21వ తేదీన రాముడి విగ్రహానికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. 

ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేసిందని యూబీటీ శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఈవెంట్‌గా చేసిన ఆ పార్టీ త్వరలో రాముడిని లోక్‌సభ అభ్యర్ధిగా ప్రకటించడమే మిగిలుందని వ్యంగ్యాస్థాలు సంధించారు. అయోధ్యలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేడుకల్లో స్వచ్ఛత అనేది లేకుండా పోయిందని, కేవలం రాజకీయ ప్రయోజనాలకే ఈ కార్యక్రమాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు సంజయ్ రౌత్. 

రాముడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్న బీజేపీకు ఇక మిగిలింది రాముడిని లోక్‌సభ అభ్యర్ధిగా ప్రకటించడమేనుకుంటా అన్నారు. గతంలో కూడా అయోధ్య రామమందిరం అంశంపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకకు దేశానికి సంబంధం లేదని, కేవలం బీజేపీ ఈవెంట్ అని చెప్పుకొచ్చారు. బీజేపీ ఈవెంట్ కార్యక్రమాలు ముగిసిన తరువాతే అయోధ్యను ఉద్థవ్ థాక్రే సందర్శిస్తారన్నారు. బీజేపీ ఈవెంట్‌కు తామెందుకు వెళ్లాలని ప్రశ్నించారు. 

Also read: Anti Aging Foods: ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే చాలు, వృద్ధాప్యం ఎప్పటికీ చేరదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News