Robin Minz: చదివింది పదో తరగతి, ఐపీఎల్‌లో మాత్రం కోట్ల సంపాదన

Robin Minz: ఐపీఎల్ 2024 వేలంలో ఊహించని పరిణామాలు, అద్భుతాలు, రికార్డు స్థాయి ధరలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అందులో భాగమే ఈ జూనియర్ ధోని. చదివింది పదో తరగతే కానీ ఐపీఎల్ వేలంలో కోట్లు సంపాదించాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 20, 2023, 10:36 AM IST
Robin Minz: చదివింది పదో తరగతి, ఐపీఎల్‌లో మాత్రం కోట్ల సంపాదన

Robin Minz: దుబాయి వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలం అందరి అంచనాలు తలకిందులు చేసేసింది. కొందరు ఐపీఎల్ చరిత్రలోనే భారీ ధర పలికితే..మరి కొందరు అసలు విక్రయానికే నోచుకోలేదు. ఇంకొందరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు రికార్డు ధర లభించింది. అందులో ఒకడు ఈ జూనియర్ ధోనిగా భావిస్తున్న రాబిన్ మింజ్.

రాబిన్ మింజ్. పదో తరగతితో చదువు అటకెక్కించేశాడు. జార్ఘండ్‌కు చెందిన 21 ఏళ్ల అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్ అండ్ హిట్టర్‌కు ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధరే లభించింది. 20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో దిగిన ఇతడిని దక్కించుకునేందుకు ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయంటే అతడి స్థాయి ఏంటో అర్దం చేసుకోవచ్చు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోటీ తీవ్రంగానే సాగింది. చివరికి 3.6 కోట్ల భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో విక్రయమైన మొట్టమొదటి గిరిజనుడు. 

తండ్రి ఇండియన్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం జార్ఘండ్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నాడు. రాబిన్ మింజ్ క్రికెట్‌పై మక్కువతో చదువు పక్కనపెట్టేశాడు. క్లబ్ క్రికెట్, అండర్ 19, అండర్ 25లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. క్లబ్ క్రికెట్‌లో రాబిన్ మింజ్ స్ట్రైక్ రేట్ 140 దాటి ఉంది. దేశవాళీ టీ20 టోర్నీలో మొదటి మ్యాచ్‌లోనే 35 బంతుల్లో 73 పరుగులతో సంచలనం సృష్టించాడు. ఇతడి టాలెంట్ గుర్తించిన ముంబై ఇండియన్స్ టాలెంట్ హంట్‌లో అతడిని ఎంపిక చేసి బ్రిటన్‌లో శిక్షణ ఇప్పించింది. అందులో మరింత రాటుదేలిన రాబిన్ మింజ్ ఐపీఎల్ వేలంలో 20 లక్షల నుంచి 3.6 కోట్లు దక్కించుకున్నాడు. 

Also read: Sameer Rizwi: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు అంత ధర ఎందుకు, ఎవరీ సమీర్ రిజ్వీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News