Abhiram Teaser: వైవిద్యమైన ప్రేమ కథ.. ఆకట్టుకునే కథాంశంతో మనం ముందుకు రాబోతున్న సినిమా అభిరామ్. రామకృష్ణార్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీనివాసులు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఇటీవలే ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సినిమా యూనిట్. అభిరామ్ చిత్ర నిర్మాత శ్రీనివాసులు గారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ గారిని కలిసి టీజర్ చూపించడం జరిగింది.
ఈ టీజర్ ని చూసి ప్రసన్నకుమార్ సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఆడియో సాంగ్స్ ఇప్పటికే టిప్స్ మ్యూజిక్ లో విడుదలై మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఈ సినిమా మ్యూజిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో చూస్తుంటే ఈ సినిమా ఒక మంచి లవ్ స్టోరీ తో కూడిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో కనిపిస్తోంది. ఈ సినిమాలో శివ బాలాజీ గారు యష్ రాజ్ గారు తో పాటు సీనియర్ మోస్ట్ యాక్టర్స్ అన్నపూర్ణమ్మ గారు తులసి గారు రఘు బాబు గారు వై విజయ గారు కూడా ముఖ్య పాత్రలలో నటించారు. బాహుబలి ప్రభాకర్ గారు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. గండికోట సంస్థానం ల భారీగా ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా నిర్మాత. ఇంతమంది మంచి ఆర్టిస్టులతో కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా నిర్మించారు. ఇప్పటికే ఆడియో సక్సెస్ అయింది త్వరలో సినిమా కూడా విడుదలై మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా నిర్మాత శ్రీనివాసులు గారికి దర్శకుడు రామకృష్ణార్జున్ గారికి మంచి విజయం రావాలి అలాగే ఇంకా ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీయాలి. అభిరామ్ టైటిల్ కూడా చాలా మంచి టైటిల్'.. అని చెప్పకువచ్చారు.
ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ ‘మా ఈ అభిరామ్ సినిమా టీజర్ ని రిలీజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి.. ఆశీర్వదించడానికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి కృతజ్ఞతలు ‘ అని తెలియజేశారు.
Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి