కులాంతర వివాహాలకు టి.సర్కార్ మరింత ప్రోత్సాహం

                        

Last Updated : Sep 25, 2018, 07:05 PM IST
కులాంతర వివాహాలకు టి.సర్కార్ మరింత ప్రోత్సాహం

హైదరాబాద్ : ఎస్సీల్లో కులాంతరం వివాహాలను మరింత ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  ప్రోత్సాహకంగా అందించే ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచాలని యోచినట్లు సమాచారం. ప్రస్తుతం ఇస్తున్న రూ.50 వేల సాయాన్ని రూ.2.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది .ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఓ ప్రముఖ మీడియాలో ప్రచురితమైంది. ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన  ఉత్తర్వులు త్వరలోనే జారీ చేసే అవకాశముంది. రాష్ట్రంలో ఎస్సీల కులాంతర వివాహాలు ఏటా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సామాజికవర్గానికి ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది

వాస్తవానికి ఎస్పీవర్గానికి చెందిన దళిత యువతుల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ్ లక్ష్మీ పథకం ద్వారం లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తోంది. కులాంతరం వివాహం చేసుకుంటే ప్రోత్సహకంగా మరో 50 వేలు అదనంగా ఇస్తున్నారు. ఈ లెక్కన కులాంతర  వివాహం చేసుకున్న దళిత జంటకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి  లక్షా 50 వేలు అందుతున్నాయి. అయితే  కులాంతర వివాహం కారణంగా తల్లిదండ్రులతో సత్సంబంధాలు లేక యువతులు కల్యాణ లక్ష్మి కింద లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కులంతరం వివాహాలను ప్రోత్సహించే చర్యలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించినట్లయితే కులాంతర వివాహాలు చేసుకోవాలనుకునే దళిత యువతి,యువకులకు వరంగా మారనుంది. 

Trending News