Eagle Songs: సరికొత్త లుక్ లో రవితేజ.. ఈగల్ ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

Eagle Movie: రవితేజ ఈగల్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఇందులో రవితేజ డ్యాన్స్, లుక్ అదిరిపోయింది. ఫుల్ సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 08:00 PM IST
Eagle Songs: సరికొత్త లుక్ లో రవితేజ.. ఈగల్ ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

Eagle Movie Aadu Macha Song Promo Released: మాస్ మహారాజా రవితేజ నయా మూవీ ఈగల్‌ (Eagle). కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. టైగర్ నాగేశ్వరరావు సూపర్ హిట్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈగల్‌పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు, టీజర్ మూవీపై వీర లెవల్లో హైప్ క్రియేట్ చేశాయి. 

తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఆడుమచ్చా సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. రాహుల్ సిప్లిగంజ్‌ పాడిన ఈ పాటలో రవితేజలో లాంగ్ హెయిర్‌, గడ్డంతో ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. డిసెంబరు 05 సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ఫుల్ లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

ఈ చిత్రంలో నవదీప్‌, కావ్య థాపర్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈగల్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. Davzand సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రవితేజ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో RT4GM (వర్కింగ్‌ టైటిల్‌)తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ రూపొందిస్తోంది. డైరెక్టర్ కార్తిక్‍తో పాటు కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లా కూడా సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News