Uttar Pradesh Urinate Case: ఉత్తరప్రదేశ్ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మీరట్‌లో 12వ తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు.. చిత్రహింసలకు గురిచేసి ముఖంపై మూత్ర విసర్జన కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 12వ తరగతి చదువుతున్న బాలుడు.. తన అత్త ఇంటికి దీపావళి మిఠాయిలు పంచేందుకు వెళ్తుండగా దుండగులు కిడ్నాప్ చేశారు. సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లి.. కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించారు. దాడికి పాల్పడి.. ముఖంపై మూత్రం పోసి వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ భయానక సంఘటనలో దుండగులు విద్యార్థిపై శారీరకంగా దాడి చేసి అవమానించడమే కాకుండా బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తానని బెదిరించి బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేశారు.
వీడియో వైరల్ కావడంతో మీరట్ పోలీసులు ఈ ఘటనపై వేగంగా స్పందించి నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. "మొహల్లా జాగృతి విహార్‌లో ఒక యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. దాడి సమయంలో ఆ యువకుడిపై మూత్రం పోశారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం.." అని సిటీ పోలీసులు వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఫౌల్ ప్లే చేశారని బాధితుడి తండ్రి ఆరోపించారు. కేసు నమోదులో లోపాలను గుర్తించిన ఆయన.. నిందితులు త్వరలో బెయిల్‌పై విడుదలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మీరట్‌లో జరిగిన ఈ ఘటనపై భయాందోళనలను వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఇదే విధమైన కేసు నమోదైంది. గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లా అనే నిందితుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఒక దళిత బాలుడిని దారుణంగా కొట్టి, బలవంతంగా మూత్రం పోసి ఆ బాలుడితోనే తాగించారు. అనంతరం ఆ బాలుడి కనుబొమ్మలను కూడా షేవ్ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. తాజాగా మళ్లీ అలాంటి ఘటన వెలుగులోకి రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook