Mohan Babu: డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, విలక్షణ నటుడు, నట ప్రపూర్ణ .. ఈ పేర్లు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు మోహన్ బాబు. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేయని పాత్ర లేదు. హీరోగా.. కమడియన్ గా.. విలన్ గా.. ఆయన ఏ పాత్ర చేసిన అందులో పాత్ర కనిపిస్తుంది కానీ ఆయన కనిపివ్వరు. కాగా అలాంటి మోహన్ బాబు సినిమా రంగంలోకి వచ్చి 48 ఏళ్లు అవుతోంది. నటుడిగా ఆయన ఈ 48 ఏళ్లలో ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్రను వేశారు.
ఈ నలభై ఎనిమిది సంవత్సరాల తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎత్తుపల్లాలను చూశారు. కానీ ఎప్పుడూ కొంచెం కూడా తడబడలేదు ఈ పెదరాయుడు.. మరి ఆయన 48 ఏళ్ల నటన జీవితం ఎలా కొనసాగిందో ఒకసారి చూద్దాం.
కెరియర్ ప్రారంభంలో..
భక్తవత్సలం నాయుడు కాస్త తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి మోహన్ బాబుగా మారారు. 70వ దశకంలో ఆయన నట ప్రస్థానం మొదలైంది. అంత సులువుగా అయితే మోహన్ బాబు ఈ స్థాయికి రాలేదు. ఆరంభంలో అందరికీ ఎదురైనట్టుగానే ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఎంతో కష్టపడి స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు మోహన్ బాబు. ఆయన నాడు వేసిన పునాదులపై మంచు వారి ఘనత చెక్కు చెదరని భవనంలా నిలబడింది.
నటుడిగా ప్రయాణం..
అసెంబ్లీ రౌడీ.. అల్లరి మొగుడు.. గృహప్రవేశం.. పెదరాయుడు.. కేతు గాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే మోహన్ బాబు నటించిన మరపురాని చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ సినిమాలలో ఆయన చేసిన పాత్రలు ఇక ఏ హీరో కూడా చేయలేదు అన్నట్టుగా అనిపిస్తుంది.
మోహన్ బాబు స్టైలే వేరు…తనదైన రీతో డైలాగ్స్ చెప్పడం, విలక్షణంగా నటించడం, నవ్వించడం, ఏడిపించడం, విలనిజంలో కొత్తదనం చూపించడంతో అతి కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలలో కలెక్షన్ కింగ్ గా చోటు సంపాదించుకున్నారు. పాత్రలకు ప్రాణం పోయడంలో ఆయన స్పెషలిస్ట్. ఆయన చేసిన కారెక్టర్లు తెలుగు వారి మదిలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి.మోహన్ బాబు డైలాగ్స్ చెబుతూ ఉంటే ఎలాంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. ఆయన సినిమాలలో యావరేజ్ హిట్ సినిమా రాయలసీమ రామన్న చౌదరి చూస్తే.. ఆయనలోని హుండాతనం.. ఆయన డైలాగ్ డెలివరీ.. ఎంత గొప్పగా ఉంటుందో అర్థమైపోతుంది. ఇక ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు గురించి చెప్పనవసరమే లేదు.
నిర్మాతగా ప్రయాణం..
మోహన్ బాబు తనకు సినిమా పరిశ్రమ మీదున్న మక్కువతో ఆయన నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
కలెక్షన్స్ సునామి…
మోహన్ బాబు ఖాతాలో ఎప్పటికీ చెరిగినిపోని రికార్డులున్నాయి. అల్లరి మొగుడు..పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించడమే కాకుండా.. మోహన్ బాబుని విలక్షణ నటుడిగా నిలబెట్టేశాయి.
నటనకు మారుపేరు..
ఇంతకుముందు చెప్పినట్టు మోహన్ బాబు డైలాగ్స్ చెబుతూ ఉంటే దానికి ఫిదా అవని వారు ఎవరు ఉండరు. కాగా డైలాగ్స్ కాదు ఆయన మేనరిజం కూడా
నా రూటే వేరు అన్నట్టు అందరిని విపరీతంగా అలరిస్తాయి. పెదరాయుడు లో మోహన్ బాబు నడుస్తూ వస్తుంటే.. మనం రజినీకాంత్ కన్నా కూడా ఆయన స్టైల్‌ని ఎక్కువగా ఇష్టపడ్డాము. దాన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన స్టైల్ ఏ లెవెల్ లో ఉంటుందో.
ఇండస్ట్రీలో ఐదు దశాబ్దాలు..
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి తన స్వయం కృషితో ఎదిగి దాదాపు ఇండస్ట్రీలో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. మోహన్ బాబు చిత్ర పరిశ్రమలో నటుడిగా 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పట్టుదల, అంకితభావం అందరికీ నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటికీ ఆయన నవతరానికి స్పూర్తిగానే నిలుస్తున్నారు. నటుడిగా ఐదు దశాబ్దాలకు దగ్గర పడుతున్నా.. ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఎనర్జీతో షూటింగ్లో పాల్గొంటున్నారు. పద్మశ్రీ గెలుచుకున్న ఆయనకు ఇప్పటికీ సరైన పాత్ర పడితే బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించడం ఖాయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook