IRCTC Online Ticket Booking: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా..? ఎంత రీఫండ్ వస్తుంది..? క్యాన్సిలేషన్ రూల్స్ ఇవే..!

Train Ticket Cancellation Rules: ముందుగా బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే రీఫండ్ రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి. ట్రైన్ బయలుదేరే సమయంపై ఆధారపడి మీకు రీఫండ్ అందుతుంది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 21, 2023, 05:39 PM IST
IRCTC Online Ticket Booking: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా..? ఎంత రీఫండ్ వస్తుంది..? క్యాన్సిలేషన్ రూల్స్ ఇవే..!

Train Ticket Cancellation Rules: మన దేశంలో రైలు ప్రయాణానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం లక్షలాది మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. దూర ప్రయాణానికి అయితే ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకుంటునే బెర్త్‌లు లభిస్తాయి. లేదంటే జనరల్ కంపార్ట్‌మెంట్లలో జనాల రద్దీలో ఇరుక్కుని వెళ్లాల్సి ఉంటుంది. రైలు ప్రయాణానికి సంబంధించి టికెట్లను ఇండియన్ రైల్వేస్ ఐఆర్‌సీటీసీలో  వెబ్‌సైట్, యాప్‌లో విక్రయిస్తోంది. https://www.irctc.co.in వెబ్‌సైట్ లేదా ఐఆర్‌సీటీసీ యాప్‌లో ఆన్‌లైన్ పేమెంట్‌ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే అనుకోకుండా ఒక్కోసారి ముందుగా ప్లాన్ చేసుకున్న టూర్ క్యాన్సిల్ అయితే టికెట్లను క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. మరీ ఐఆర్‌సీటీసీ నుంచి రీఫండ్ వస్తుందా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి..? వివరాలు ఇలా.. 

టికెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించి ఇండియాన్ రైల్వేస్‌లో వివిధ రకాల కేటగిరీలు ఉన్నాయి. రైలు బయలుదేరే ముందు ఎంత సమయంలో టికెట్ క్యాన్సిల్ చేశారనే విషయంపై ఆధారపడి మీకు రీఫండ్ అందుతుంది. మీరు టికెట్ క్యాన్సిల్ చేసిన తరువాత 5 నుంచి 7 రోజుల్లోగా (వర్కింగ్ డేస్) కొన్ని ఛార్జీలు మినహాయించి మిగిలిన డబ్బును మీరు ఏ పేమెంట్ మోడ్‌ చెల్లించారో అందులోనే ఐఆర్‌సీటీసీ జమ చేస్తుంది. 

సాధారణంగా ట్రైన్ బయలుదేరే రెండు గంటల ముందు ఛార్ట్ ప్రిపేర్ అవుతుంది. మీరు ఆన్‌లైన్‌లో ముందుగా బుక్‌ చేసుకున్న టికెట్‌ను ఆఫ్‌లైన్‌లో క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.in లోకి లేదా యాప్‌లో లాగిన్ అవ్వాలి. బుక్‌డ్ టికెట్స్ ట్యాబ్‌పై క్లిక్ చేసి.. మీరు క్యాన్సిల్ చేయాలనుకునే ట్రెన్ టికెట్లను సెలక్ట్ చేసుకోవాలి. ఆ టికెట్‌ ఎంచుకుని క్యాన్సిల్ ఆప్షన్‌ క్లిక్ చేస్తే.. టికెట్లు రద్దు అవుతాయి. యాప్‌లో అప్‌కమింగ్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 

క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా..

==> రైలు స్టేషన్ నుంచి బయలుదేరడానికి 48 గంటల ముందుగా టికెట్ క్యాన్సిల్ చేస్తే.. ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.240 ఛార్జీ వసూలు చేస్తారు.
==> ఏసీ 2టైర్ లేదా ఫస్ట్ క్లాస్‌కు అయితే 200 రూపాయల ఛార్జీ ఉంటుంది.
==> ఏసీ 3 టైర్ లేదా ఏసీ ఛైర్ కార్ లేదా ఏసీ 3 ఎకానమీకి అయితే రూ.180 ఛార్జీ  అవుతుంది.
==> స్లీపర్ క్లాస్‌ టికెట్ రద్దు చేస్తే ఛార్జీ రూ.120గా ఉంది.
==> సెకండ్ క్లాస్‌కు అయితే రూ.60 ఛార్జీ వసూలు చేస్తారు.

==> రైలు బయలుదేరడానికి 12 నుంచి 48 గంటల్లో టికెట్ రద్దు చేస్తే.. టికెట్ రేట్లలో 25 శాతం వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. రైలు బయలుదేరే 12 గంటల నుంచి 4 గంటల్లోగా రద్దు చేస్తే.. అప్పటికి ఛార్ట్ ప్రిపేర్ అవ్వకపోతే.. టికెట్ రేట్లలో 50 శాతం ఛార్జీ తీసుకుంటారు. ఛార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత రద్దు చేసుకునేందుకు వీలు ఉండదని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఇలాంటి సమయంలో ప్రయాణికులు ఆన్‌లైన్ TDR ఫైలింగ్ చేసుకోవాలని.. ఆ తరువాత ఎప్పటికప్పుడు స్టాటస్ చెక్ చేసుకోవాలని సూచించింది.

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News