India Vs Australia World CUP 2023 Updates: 140 కోట్ల మంది భారతీయులతోపాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు వరల్డ్ కప్ 2023 ఫైనల్ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ ఫైట్ అంతా రెడీ అయింది. టోర్నీలో ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్ ఫైనల్ చేరుకోగా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఆ తరువాత వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలుపొంది ఆసీస్ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సొంతగడ్డపై ఆడనుండడం టీమిండియాకు ప్లస్ పాయింట్ కానుండగా.. ఐప్పటికే మెగా టోర్నీల్లో అలవోకగా గెలిచిన అనుభవం కంగారూలకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం అందరిలోనూ ఒకటే ప్రశ్న. భారత్ మూడోసారి ప్రపంచకప్ గెలుస్తుందా..? ఆసీస్ రికార్డుస్థాయిలో ఆరోసారి విశ్వకప్‌ను ముద్దాడుతుందా..? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఆదివారం జరిగే బిగ్ మ్యాచ్‌లో విజేత ఎవరోనని ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ అంచనా వేశారు. రెండు వైపుల జాతకాలను పోల్చి చూస్తే.. ఆస్ట్రేలియాపై భారత్‌దే పైచేయిగా ఉందని ఆయన అన్నారు. ఐసీసీ ప్రపంచ కప్ 2023 ట్రోఫీని అన్ని విధాలుగా భారత్ కైవసం చేసుకోనుందన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జాతకం కంటే టీమిండియా జాతకం చాలా మెరుగ్గా.. బలంగా ఉందన్నారు. మ్యాచ్ రోజున ప్రత్యర్థిని ఓడించేందుకు భారత ఆటగాళ్లకు ఇది ఉత్సాహం, శక్తి, చిత్తశుద్ధి, అంకితభావాన్ని అందిస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
అదేవిధంగా టీమిండియా ప్లేయర్ల జాతకం గురించి చెబుతూ.. రోహిత్ శర్మ జాతకం ఈ ప్రపంచ కప్‌లో అతని నాయకత్వ నైపుణ్యంలో సహాయపడిందని తెలిపారు. హిట్‌మ్యాన్ గ్రహాల స్థానాలు, అమరికలు 2011 ప్రపంచ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి చాలా పోలి ఉంటాయన్నారు. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ప్రపంచ కప్ 2023 ట్రోఫీని ఎత్తి జట్టు కోసం చరిత్ర సృష్టిస్తాడని జోస్యం చెప్పారు పండిట్ జగన్నాథ్ గురూజీ.
శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు తమ జాతకాలలో బలమైన యురేనస్, వీనస్, నెప్ట్యూన్లను కలిగి ఉన్నారని చెప్పారు. వారు అన్నింటికీ సిద్ధంగా ఉన్నారని.. ఆధిపత్యం ప్రదర్శించేందుకు.. చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుందన్నారు. భారత్ 8వ ఇంటిలో అంగారకుడి ఉనికిని సూచిస్తుందని.. టీమిండియా ప్లేయర్లు వారి బలాలపై దృష్టి పెట్టాలని అన్నారు.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి