Shani Dev: త్వరలోనే 2024 సంవత్సరం ప్రారంభం కాబోతోంది..ఈ సంవత్సరంలో అతి ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడుతో పాటు అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా న్యాయ దేవతగా భావించే శని గ్రహం కూడా సంచారం చేయబోతోంది. ఈ గ్రహం 2024లో జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు తిరోగమన స్థితిలో ఉండబోతోంది. కాబట్టి ఈ శని గ్రహ ప్రభావం మొత్తం 12 రాశులవారిపై పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి కొత్త సంవత్సరంలో ఊహించని లాభాలు కలుగుతాయి.
మేషరాశి:
2024 సంవత్సరంలో మేషరాశి వారికి శని ప్రత్యేక స్థానంలో రాబోతోంది. దీని కారణంగా మేషరాశివారికి అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు జీవితంలో అపారమైన సానుకూల మార్పులు వస్తాయి. దీంతో పాటు ఉద్యోగంలో బదిలీలతో పాటు పదోన్నతులు లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి.
సింహ రాశి:
సింహరాశి వారికి శని గ్రహం సంచారం చేయడం కారణంగా 2024 సంవత్సరంలో శుభ సమయాలు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైన ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వైవాహిక జీవితం కూడా చాలా బాగుటుంది. అంతేకాకుండా సామర్థ్యం పెరగడం కారణంగా అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు.
మకర రాశి:
2024 సంవత్సరంలో మకర రాశి వారికి శనిగ్రహం సంచారం కారణంగా చాలా రకాల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అన్ని రంగాల్లో సౌకర్యాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే మెరుగుపడతాయి. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి నుంచి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతుఆయి. వ్యాపారాలు విస్తరించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. జీవితంలో కొత్త సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పిల్లల నుంచి శుభవార్తలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి