Is Lemon Good For High BP: అధిక రక్తపోటుతో బాధపడేవారిలో సులభంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీపీ నియంత్రణలో లేకపోతే గుండెపై ఒత్తిడి పెరిగి ధమనులు దెబ్బతినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది బీపీని తగ్గించుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ చాలా మందిలో రక్తపోటు కంట్రోల్లో ఉండడం లేదు. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు లెమన్ వాటర్ తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు. ఈ నిమ్మరసంలో సోడియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఇది రక్తపోటును పెంచే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు నిమ్మరసం తాగడం మంచిదేనా ఈ రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ వాటర్ హైబీపీని తగ్గింస్తుందా?
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందించిన నివేదిక ప్రకారం.. నిమ్మకాయలో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల ధమనుల నుంచి వ్యర్థాలు, కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అంతేకాకుండా శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది. దీని కారణంగా బీపీ కూడా నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
అధిక రక్తపోటుతో బాధపడేవారు నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది:
అధిక బీపీతో బాధపడేవారు ప్రతి రోజు లెమన్ వాటర్ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా చేస్తాయి. దీంతో పాటు ధమనులు కూడా ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి. దీని కారణంగా గుండెపై ఒత్తిడి తగ్గి అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి:
లెమన్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లాభిస్తాయి. ఇవి గుండె సమస్యల బారిన పడకుండా ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గింస్తుంది. ధమనులపై పెరుగుతున్న ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. దీని కారణంగా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతి రోజు లెమన్ వాటర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook