Bjp-Janasena: జనసేన పార్టీ రాజకీయాలు విభిన్నంగా ఉన్నాయి. ఏపీలో టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసొచ్చినా రాకపోయినా ఫరవాలేదన్నారు. కానీ తెలంగాణ ఎన్నికల్లో మాత్రం బీజేపీతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్తున్నారు. తెలంగాణలో బీజేపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది.
తెలంగాణ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రదానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మరోవైపు బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది. తెలంగాణలో జనసేనకు 9 స్థానాలు కేటాయించేందుకు బీజేపీ నిర్ణయించగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. ఈ 9 స్థానాల్లో 6 స్థానాలపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఇంకా 3 స్థానాల్లో స్పష్టత రావల్సి ఉంది. ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కూకట్‌పల్లి, వైరా, నాగర్ కర్నూలు స్థానాలను జనసేనకు కేటాయించారు. మిగిలిన 3 స్థానాలేంటనేది ఇంకా తెలియలేదు. వాస్తవానికి పొత్తులో భాగంగా జనసేన తెలంగాణలో 32 స్థానాలు ఆశించింది. అయితే అమిత్ షాతో చర్చల అనంతరం 9 స్థానాలకు పపన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.
మొత్తం 119 నియోజకవర్గాల్లో బీజేపీ ఇప్పటికే 88 స్థానాల్లో అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. ఇంకా 31 నియోజకవర్గాలు పెండింగులో ఉండగా జనసేనకు 9 కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటే ఇంకా 22 స్థానాలకు బీజేపీ అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ మూడు జాబితాల ద్వారా 88 మంది అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఇప్పుడు 22 మంది అభ్యర్ధులతో 4వ జాబితా విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే జనసేనకు కేటాయించాల్సిన మిగిలిన మూడు స్థానాలు నిర్ణయించాల్సి ఉంటుంది.
ఈ నెల 7వ తేదీన ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ సైతం పాల్గొననున్నారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన గతంలో జరిగిన వివిధ అసెంబ్లీ ఉప ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీకు సహకరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook