Telangana Elections 2023: ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో స్పీచ్ లతో అదరగొడుతున్నారు. ఈ రోజు జరిగిన బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభ సీఎం మాట్లాడారు.. కేసీఆర్ మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస రెడ్డి మొత్తం చెప్పారు. నేను చెప్పాల్సిందేమి లేదు. తెలంగాణ రాకముందు బాన్సువాడకు వచ్చాం.. ఉప్పెనలా ఉద్యమం చేస్తే తెలంగాణ సాధించుకున్నాం. నిజం సాగర్ ఎండిపోయింది.. సింగూరు నీళ్లు హైదరాబాద్ కు పోతున్నాయి. ప్రజలు వలసలు మూడు నాలుగు నెలల పాటు ఆర్థిక వేత్తలతో కూర్చుని మెదడు కరుగపెట్టినం.. అన్ని నియోజకవర్గంలో కంటే బాన్సువాడలో ఎక్కువగా జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉజ్వల ప్రగతి సాధించాం.
తలసరి ఆదాయం గీటురాయి చూస్తారు. అభివృద్ధి చెందిందా లేదా అని చూసేది తలసరి ఆదాయం చూస్తారు. పదేండ్ల యుక్తవయస్సు ఉన్న రాష్ట్రం మనది. అవినీతి రహితంగా చిత్తశుద్ధితో పనిచేసాము. భారతదేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉంది. పదేండ్లు నిబద్ధతో, నీతితో పనిచేస్తే పేదల దుఖం తీరింది. వ్యవసాయ మంత్రి గా ఉన్నప్పుడు కేంద్రంతో కొట్లాడి ఎరువులు తెచ్చేది శ్రీనివాసరెడ్డి.. అందుకే లక్ష్మీపుత్రుడు అని పేరుపెట్టుకున్నాం. బాన్సువాడ బంగారువాడగా మారింది.
తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు ఏం చెప్పిందో అదే జరిగింది. 200 కు పైగా ముస్లీంల కోసం రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో పరస్పరం ప్రేమించే తత్వంగా సంస్కృతి ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి అజాత శత్రువు.. దురదృష్టమేంటంటే చాతకాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతకాని వెధవలు. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి మీద కత్తిపోట్లు పొడిచి దారునం చేసినారు. హత్యాయత్నం చేసిండ్లు. భగవంతుడి దయ వల్ల అపాయం తప్పింది.
ఇటువంటిది రాజకీయమా, అరాచకమా..?
నిజాం సాగర్ ను పూర్వ పాలకులు సర్వనాశనం చేసారు.. సింగురును కూడా హైదరాబాద్ కు ఇచ్చేశారు. పంటలు కాపాడుకోవడానికి.. నిజాం సాగర్ నీళ్లు రావాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి ధర్నాలు, దీక్షలు చేశారు. ఇక నుండి నిజాం సాగర్ 360 రోజులు నిండే ఉంటది. నీళ్లు అందిస్తుంది. శ్రీనివాసరెడ్డి రుబాబు చేయడు.. తపన ఎక్కువ.. అనేక రిజర్వాయర్లు కట్టిస్తున్నాడు. 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నా నియోజకవర్గంలో కూడా కట్టలేదు కానీ బాన్సువాడలో కట్టారు.
లక్ష పై చిలుకు మెజారిటీతో గెలిపించి పంపించే బాధ్యత మీదే. ఆయనను ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత నాది. చేతకాని దద్దమ్మలు, వెధవలు పనిచేసే చేతకాక ప్రజల ముందు ఎన్నికలు ఎదుర్కునే దమ్ములేక ..హింసకు దాడులకు దిగబడుతున్నారు. కత్తులు పట్టి మా అభ్యర్థుల మీద దాడులు చేస్తున్నారు. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలి. కత్తి పట్టుకుని పొడవాలంటే ఇంతమందిమి ఉన్నం చేతుల్లేవా..మొండితో లండుతో కత్తి దొరకదా. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా..
10 సంవత్సరాల్లో ఎన్నో ఎన్నికలు జరిగాయి.. ఎన్నడు మనం హింసకు దిగలేదు. గెలిపిస్తే గెలిచినం.. చేతనైన కాడికి సేవచేసినం.. దుర్మార్గమైన పనులు చేయలేదు.. మా సహనాన్ని పరీక్షిస్తే ఇవ్వాల దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి కేసీఆర్ మీద జరిగిన దాడిగా చెబుతున్నా.. ఈ దాడులు ఆపకపోతే, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే . మేము కూడా అదేపనికి పూనుకుంటే దుమ్మకూడా మిగలదు. మేం బాధ్యతలో ఉన్నమని, పదవులు ప్రజలు ఇచ్చారని బాధ్యతతో ఉన్నాం. కరెంటు ఎట్ల రావాలే. నీళ్లు ఎట్ల రావాలనే నిరంతర ఆలోచనతో ఉంటాం.
Also Read: Anasuya : ఎక్స్‌పోజింగ్ చేయడం ఈజీ కాదు.. నెటిజన్‌కు అనసూయ దిమ్మతిరిగే కౌంటర్
మీకు దమ్ముంటే ఎజెండా ఏందో చెప్పండి. ప్రజల ముందుకు రండి. మీ వాదనోంటే చెప్పండి. మా వాదన మేం చెబుతం. ఎవరిని గెలిపిస్తే వారు పనిచేయాలి. లేకుంటే ఎవనికున్న పని వాడు చూసుకోవాలే. లంగ చాతలు ఏంది..? గుండాగురి ఏంది..? కత్తుల పట్టి పొడిచేది ఏంది. అక్కడ గన్ మెన్ అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి ప్రాణాపాయం తప్పింది. గన్ మెన్ కు కూడా గాయాలయ్యాయి. ఇటువంటి పద్ధతులను ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండించాలని, తెలంగాణ మేధావి లోకం, తెలంగాణ పెద్దలు, తెలంగాణ శ్రేయస్సు కోరే వాళ్లందరూ హింసా రాజకీయాలను ఖండించాలి. పిరికిపందలు చేతకాని వాళ్లు ఇటువంటి పనులు చేస్తారు. చేతనైన మొగోడు ఎవ్వడూ ఈ పనిచేయ్యడు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మనసు ఉల్లాసంగా లేదు. శ్రీనివాస్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి రాష్ట్ర స్థాయిలో వారి గౌరవాన్ని మరింత పెంచాలి. సభలో మాజీ మంత్రి, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, మాజీ స్పీకర్,ఎమ్మెల్సీ మధుసూధనాచారి, టీసీసీఐ ఛైర్మన్ బాలమల్లు, నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మన్ మోహన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: CM KCR: చేతగాని దద్దమ్మలు కత్తి పోట్లకు ఒడిగట్టారు.. నాపై దాడిగానే భావిస్తా..: సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..