World Cup 2023: హైదరాబాద్ వేదికగా నిన్న జరిగిన శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని ఛేధించిన తొలి జట్టుగా నిలిచింది. శ్రీలంక విధించిన 345 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ శ్రీలంకపై గెలుపుతో వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. అబ్దుల్లా షఫీక్, మొహమ్మద్ రిజ్వాన్ కలిసి మూడవ వికెట్‌కు 176 పరుగుల భారీ బాగస్వామ్యం నెలకొల్పడమే కాకుండా ఇద్దరికిద్దరూ సెంచరీలు సాధించి శ్రీలంక విధించిన 345 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించేశారు. ఓ దశలో 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఆ తరువాత తేరుకుని కొండంత లక్ష్యాన్ని సులభంగా దాటేసింది.
పాకిస్తాన్ ఛేధించిన ఈ లక్ష్యం వన్డే ప్రపంచకప్ చరిత్రలో కొత్త రికార్డు. ఇంత భారీ లక్ష్యాన్ని గతంలో ఏ జట్టూ ఛేదించలేదు. ఛేజింగ్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు 2011 ప్రపంచకప్‌లో ఐర్లండ్ జట్టు ఇంగ్లండ్‌పై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటి వరకూ ప్రపంచకప్‌లో నమోదైన ఐదు ఛేజింగ్ స్కోర్ల వివరాలు ఇలా ఉన్నాయి...
2023లో పాకిస్తాన్ శ్రీలంక జట్టుపై 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పగా అంతకముందు 2011లో ఐర్లండ్ జట్టు ఇంగ్లండ్‌పై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 2019లో వెస్టిండీస్ జట్టుపై బంగ్లాదేశ్ జట్టు 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా ఇదే బంగ్లాదేశ్ జట్టు 2015 ప్రపంచకప్‌లో స్కాట్లండ్‌పై 319 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇసక 1992లో జింబాబ్వేపై శ్రీలంక 313 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఛేదించిన అత్యధిక పరుగుల లక్ష్యం ఇదే. అయితే ప్రపంచకప్ కాకుండా వన్డేల్లో అయితే 2022లోఆస్ట్రేలియాపై 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మరోవైపు శ్రీలంక నుంచి కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమలు, పాకిస్తాన్ నుంచి అబ్దుల్లా షపీక్, మొహమ్మద్ రిజ్వాన్ ఏకంగా నలుగురు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ప్రపంచకప్‌లో ఇదే తొలిసారి. వన్డేల్లో మూడవసారి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook