TTD Sanitation Workers Salaries Hike: అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తామని భూమన టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తులు తమకు ముఖ్యమైన రోజులలో హోమంలో స్వయంగా పాల్గోనే అవకాశం కల్పిస్తామని చెప్పారు. టీటీడీ పారిశుధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. టీటీడీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయనకు మీడియాకు వివరించారు. మొత్తం 5 వేల మంది పారిశుధ్య కార్మికులకు జీతాల పెంపు వర్తిస్తుందని తెలిపారు.
టీటీడీ పరిధిలోని కార్పొరేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా నిర్ణయించామన్నారు కరుణాకర్ రెడ్డి. కార్పొరేషన్లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పోందితే వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. అదేవిధంగా కార్పొరేషన్లో పని చేస్తూ ఈఎస్ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ వర్తింపజేస్తామన్నారు. నారాయణగిరి ఉద్యాణవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటుకు 18 కోట్లు కేటాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.
"నారాయణగిరిలో హోటల్, అన్నమయ్య భవన్లో హోటల్స్‌ను టూరిజం శాఖకు అప్పగిస్తాం.. ఆకాశ గంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రూ.40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తాం. వరహస్వామి అతిధి గృహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తాం. తిరుపతిలో టీటీడీ అనుబంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాలలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ఆ బాధ్యతలను టీటీడీ పరిధిలోకి తీసుకువస్తాం..
పురాతన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తాం.. తిరుపతిలోని చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు రూ.25 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తాం. టీటీడీ పరిధిలోని పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించేందుకు దిట్టం పెంచుతాం. టీటీడీ కళ్యాణ మండపాలలో వివాహాల సందర్భంగా డిజేలకు బదులుగా లలితా గీతాలు పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తాం. టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాని కోరుతు పాలకమండలి తీర్మానించింది. గరుడా సర్కిల్ వద్ద రోడ్డు వెడల్పకు అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నాం.." అని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.
Also Read: India vs Australia Highlights: వన్డే వరల్డ్ కప్‌లో భారత్ బోణీ.. ఆసీస్‌పై ఘన విజయం..
Also Read: Ravi Teja: 'అవకాశం వస్తే ఆ క్రికెటర్ బయోపిక్ లో నటిస్తా'..: హీరో రవితేజ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి