'ఫ్లోరెన్స్‌' ముప్పు: వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ

'ఫ్లోరెన్స్‌' ముప్పు: వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ

Last Updated : Sep 12, 2018, 10:08 AM IST
'ఫ్లోరెన్స్‌' ముప్పు: వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ

అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ప్లారెన్స్' హరికేన్ అగ్రరాజ్యం అమెరికా తూర్పు తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం బెర్ముడాకు 1,100కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. కరోలినా, వర్జీనియా రాష్ట్రాల మధ్య రేపు రాత్రికి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని అక్కడి వాతారణ విభాగం తెలిపింది. దీంతో ఈ రాష్ట్రాల్లో తుఫాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది భారీ విధ్వంసం సృష్టించే అవకాశముందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

అమెరికా తూర్పు తీరాన్ని ‘ఫ్లోరెన్స్‌’ తాకనున్న నేపథ్యంలో రాజధాని వాషింగ్టన్‌లో మంగళవారం తుఫాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వాషింగ్టన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు, వరదలు రావచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. 15 రోజుల పాటు హెచ్చరికలు అమల్లో ఉంటాయన్న వాషింగ్టన్‌ మేయర్‌ మురియల్‌ బౌసర్‌.. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 10 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. కాగా చివరిసారిగా వాషింగ్టన్‌లో 2016లో తుఫాను ఎమర్జెన్సీని ప్రకటించారు.

 

హాంకాంగ్‌కు పొంచి ఉన్న ముప్పు

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన టైఫూన్ హాంకాంగ్ తీరం వైపు దూసుకొస్తున్నట్లు ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. 'మంగ్‌కూట్' అని నామకరణం చేసిన ఈ సూపర్ కేటగిరి టైఫూన్ ప్రభావంతో ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ టైఫూన్ హాంకాంగ్ తీరాన్ని తాకే సమయంలో దాదాపు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Trending News