Ala Ninnu Cheri: 'అలా నిన్ను చేరి' నుంచి 'కొడిపాయే లచ్చమ్మది..' పాట వచ్చేసింది.. రిలీజ్ చేసిన మంత్రి తలసాని

Ala Ninnu Cheri Movie: హెబ్బా పటేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'అలా నిన్ను చేరి'. తాజాగా ఈ మూవీ నుంచి కోడిపాయే లచ్చమ్మది సాంగ్ ను మంత్రి తలసాని యాదవ్ రిలీజ్ చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 07:10 PM IST
Ala Ninnu Cheri: 'అలా నిన్ను చేరి' నుంచి 'కొడిపాయే లచ్చమ్మది..' పాట వచ్చేసింది.. రిలీజ్ చేసిన మంత్రి తలసాని

Ala Ninnu Cheri Movie Song: యంగ్ హీరో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం 'అలా నిన్ను చేరి'. ఈ సినిమాతో ఆడియన్స్‌కు ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి  కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 

ఇప్పటికే రిలీజైన టైటిల్ సాంగ్ అందరినీ అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి కోడిపాయే లచ్చమ్మది సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మాస్ బీట్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిలీజ్ చేశారు. మంగ్లీ పాడిన ఈ పాట కుర్రకారుని ఓ ఊపు ఊపుతోంది. సుభాష్ ఆనంద్ అందించిన బాణీలు ఆకట్టుకున్నాయి. భాను కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ లిరికల్ వీడియోలో హెబ్బా పటేల్ అందాలు, నటన, డ్యాన్స్ అంతా కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

పాటను రిలీజ్ చేసిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ‘''యంగ్ టీం అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారు. యంగ్ టాలెంట్‌ను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. యంగ్ టాలెంట్ టీం తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీపెద్ద విజయం సాధించాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’'' అని అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News