Ganesh Chaturthi 2023: జై బోలో గణేష్ మహరాజ్‌కీ జై అంటూ..దేశ వ్యాప్తంగా నిన్న భక్తులంతా గణపతి మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. పది రోజుల పాటు భక్తుల పూజలు అందుకునే గణేషుడికి ఈ రోజు నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత చతుర్దశి రోజున వినాయ నిమజ్జనం చేస్తారు. ఈ పదిరోజులు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అయితే ఈ రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం కావడంతో వినాయకుడి మండపాల వద్ధ భక్తుల సందడి పెరిగింది. అయితే ఈ రోజు ఉదయం, సాయంత్రం గణేషుడిని పూజించేవారు తప్పకుండా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఈ తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక సమయాల్లో గణేషుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ 9 రోజులు గణపతి పూజలో భాగంగా ఏయే సమయాల్లో, ఏయే పద్ధతిలో పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గణపతిని ప్రతిష్టించిన తర్వాత తొమ్మిది రోజుల పాటు పూజలో భాగంగా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. నవరాత్రులు పాటు స్వామివారికి పూజలు చేసేవారు రోజు ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పట్టు వస్త్రాలు ధరించాలి. మీ ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించి..ఉదయాన్నే దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. గణేశ విగ్రహానికి తూర్పు దిశలో కలశాన్ని ఉంచి..ఎడమ వైపు బుద్ధి-సిద్ధి దేవతలను ప్రతిష్ఠించాలి. ఇలా ప్రతిష్ఠించిన విగ్రహాలకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ పూజలో భాగంగా తప్పకుండా ఓం పుండరీకాక్షాయ నమః అనే మంత్రాన్ని చదవాల్సి ఉంటుంది.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
గణేష్ చతుర్థి శుభ సమయం:
గణేష్ చతుర్థి 18 సెప్టెంబర్ 2023న మధ్యాహ్నం 2:09 గంటలకు ప్రారంభమై..సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 3:13 వరకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు మండపాల్లో ఈ రోజు కూడా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నిమజ్జనం శుభ సమయం:
హిందూ క్యాలెండర్ ప్రకారం..గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి 19 సెప్టెంబర్ 2023న ఉదయం 11:08 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు శుభ సమయమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వినయకుడి నిమజ్జనం చేసేవారు తప్పకుండా 10 రోజుల తర్వాత చేయాల్సి ఉంటుంది.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook