Golden Rajyog: కొన్ని ప్రత్యేక గ్రహాలు నక్షత్రాలు తిరోగమనం చేయడం వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలను వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు అక్టోబర్ నెలలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సూర్యుడు, బుధ గ్రహాల కలయిక కారణంగా కూడా ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే అక్టోబర్ 11న సూర్యుడు తులారాశిలోకి సంచారం చేయడం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
తుల రాశి:
బుధాదిత్య రాజయోగం వల్ల తుల రాశి వారికి బోలెడు ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు తల్లితో గపడం వల్ల ఎన్నో రకాల లాభాలు పొందుతారు. హానికరమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పిల్లలు చదువుపై ఏకాగ్రత వహించడం మేలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడికి కూడా గురవుతారు. కాబట్టి మానసిక సమస్యలు కూడా రావచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
సింహ రాశి:
బుద్ధాదిత్య రాజయోగం కారణంగా సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాజయోగం ప్రభావం వల్ల వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో వ్యాపారాల్లో లాభాలు పొందడానికి తప్పకుండా ప్రత్యేక ఎత్తులు వేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఆటంకాలు కూడా రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు కూడా వస్తాయి. కాబట్టి ఖర్చులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
మేషరాశి:
బుద్ధాదిత్య రాజయోగం మేషరాశివారికి అత్యంత ప్రయోజనకరమైన సమయంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్‌లో మంచి లాభాలు పొందడానికి ఈ సమయంలో కష్టపడి పనులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవహారలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. వ్యాపారాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల కారణంగా ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook