Chandrababu Arrest Latest Updates: స్కిల్ కేసులో 409 సెక్షన్ వర్తిస్తుందని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది. స్కామ్‌కు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని.. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. కాగా రిమాండ్‌ను హౌస్ అరెస్టుగా భావించాలని చంద్రబాబు న్యాయవాదులు కోరగా.. న్యాయమూర్తి అంగీకరించలేదు.
బెయిల్ కోసం సోమవారం హైకోర్టును ఆశ్రయించనున్నారు చంద్రబాబు నాయుడు. రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ రాత్రికి సీట్ ఆఫీస్‌కి తరలించి.. రేపు రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటివరకు ఒక్క కేసులోనూ అరెస్టు కాలేదు. రిమాండ్‌కు వెళ్లలేదు. తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు కావడంతో పాటు రిమాండ్‌కు వెళ్లనున్నారు.
మరోవైపు ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల ఎస్పీలకు పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎవరూ రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టకుండా అవసరమైన చోట 144 సెక్షన్ అమలు చేయాలని సూచించింది.
Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook