Payakaraopeta Politics: వంగలపూడి అనితకు ఆ ఒక్క ఛాన్స్ వచ్చేనా ?

Payakaraopeta Politics: పాయకరావుపేట రాజకీయాల్లో టీడీపి తరపున మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు. కానీ, మొదటి నుంచి ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం రాజీపడటం లేదు. ప్రజల్లోనూ టీడీపీకి సానుకూల వాతావరణం కనిపంచడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2023, 08:13 AM IST
Payakaraopeta Politics: వంగలపూడి అనితకు ఆ ఒక్క ఛాన్స్ వచ్చేనా ?

Payakaraopeta Politics: ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాయకరావుపేటలో ప్రస్తుతం గొల్లబాబురావు ఎమ్మెల్యేగా కొనసాతున్నారు. పాయకరావు పేట నుండి మూడు సార్లు ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక రాజీనామ చేసి ఉపఎన్నికల్లో గెలుపోందారు. మరల 2019 ఎన్నికల్లో గెలపొందారు... వైసీపీకి పాయకరావు పేటలో అంతర్గత కుమ్ములాటలు పెద్ద సమస్యగా మా రాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావును మారుస్తారనే ప్రచారం విస్త్రతంగా జరుగుతోంది. ఈనేపథ్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మండల స్ధాయి నాయకులు రింగులీడర్లుగా మారడంతో ఇక్కడ పార్టీ పరిస్ధితి దిగజారింది. గొల్లబాబూరావుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడం, అనుచిత వ్యాఖ్యలతో రెచ్చగొట్టడం వంటి చర్యలు ఇబ్బంది కలిగించాయి. పార్టీ హైకమాండ్ పరిస్ధితులను చక్కదిద్దినప్పటికీ అంతర్గత వ్యవహారాలు మాత్రం కుదు టపడినట్టు కనిపించడం లేదు.

టీడీపి తరపున మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు. కానీ, మొదటి నుంచి ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం రాజీపడటం లేదు. ప్రజల్లోనూ టీడీపీకి సానుకూల వాతావరణం కనిపంచడం లేదు. గత ఎన్నికల్లో అనితకు వ్యతిరేకవర్గం ఏర్పడడంతో గత ఎన్నికల్లో అనిత వద్దు టిడిపి ముద్దు అంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేయడంతో టీడీపీ అధిష్టానం అనితకు టికెట్ ఇవ్వకుండా ఆమె స్థానంలో డాక్టర్ బంగారయ్యను నిలబెట్టింది. 

కీలకమైన తాండవ నదీ పరివాహక గ్రామాల్లో జనసేనకు మొగ్గు కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, కాపు సామాజిక వర్గం ఇక్కడ ముఖ్యమైనవి కాగా ప్రస్తుతానికి వైసీపీనే పటిష్టంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ.. మండల, గ్రామ స్థాయి నాయకులు ఏ విధంగా సహకరిస్తారు అనేదే ఓ ప్రశ్న. మరో వైపు అనిత సైతం దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎలాగైనా అసమ్మతి వర్గాలను కలుపుకునిపోయి.. టిడిపి జెండా ఎగుర వేయ్యాలని చూస్తున్నారు. జనసేన నుండి బోడపాటి శివదత్త్ పాయకరావు పేట నుండి పోటీకి సిద్దం అవుతున్నారు.. గొల్లబాబు రావుకు టిక్కెట్ లేకుంటే వైసీపీ అధిష్టానం మాజీ ఎమ్మేల్యే చెంగల వెంటకటరావు, బంగారయ్య వైసీపీ నుండి బరిలో దింపే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : New TTD Board Members: చర్చనియాంశంగా మారిన టిటిడి బోర్డు సభ్యుల ఎంపిక

అయితే ఈ సీనియర్ నాయకుల్లో ఎవరికి టికెట్ లభిస్తుంది అనే దానిపై సంధిగ్ధత నెలకొని ఉంది. ఎవరికి టికెట్టు వచ్చినా జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటూ నియోజకవర్గంలో వినికిడి వినిపిస్తోంది. ఒకవేళ టిడిపితో పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇస్తే  టిడిపికి టికెట్ లభిస్తుందా లేదా జనసేన పార్టీకి టికెట్ లభిస్తుందా అని పాయకరావుపేట ప్రజలు అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి : Kodali Nani: చిరంజీవిని నేను విమర్శించలేదు.. అసలు కారణం చెప్పిన కొడాలి నాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News