BRS MLA Candidates List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ మొదటి జాబితాను విడుదల చేసింది. నాలుగు స్థానాలు మినహా.. 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఏడు చోట్ల అభ్యర్థులను మార్చగా.. మిగిలిన చోట్ల మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు దక్కాయి. 115 మందిలో ఏడుగురు మహిళలకు సీఎం కేసీఆర్ టికెట్లు కేటాయించారు. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్యే కవితను ట్రోల్స్ చేస్తున్నాయి. లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కవిత ఢిల్లీలో చేసిన ధర్నాలు గుర్తు చేస్తూ.. 33 శాతం అంటే 7 సీట్లేనా..? కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో.. పార్లమెంట్‌లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఫైర్ అయ్యారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా..? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ, గాంధీ భవన్ గాడ్సే అయిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
"ఉత్తరప్రదేశ్‌లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారన్నది గుర్తుంచుకోవాలి. గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే.. ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చింది. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారు. తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ వాడుకుంది.
మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే మా డిమాండ్‌ను కూడా వెకిలిగా మాట్లాడడం ఉద్యమకారుల మీద గన్ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యం. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా, మహిళలకు దక్కాల్సినన్ని స్థానాలు దక్కడం లేదనదే మహిళల ఆవేదన. రాజ్యంగ పరంగానే మహిళల హక్కులు అమలు కావాలి. దానికి చిత్తశుద్దితో అన్ని పార్టీలు కలిసి రావాలి. నేను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదు.. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు.." అని కవిత అన్నారు. అంతకుముందు బీజేపీకి కూడా కౌంటర్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లపై బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు మోసం చేసిందని అన్నారు.
Also Read: TS Politics: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. పార్టీ మారనున్న నేతలు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook