BRS MLA Candidates First List: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ సిద్ధమైంది. సీఎం కేసీఆర్ సోమవారం అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 115 మందితో మొదటి జాబితాను విడుదల చేశారు. ఏడు స్థానాల్లో అభ్యర్థులను మార్చగా.. మిగిలిన స్థానాల్లో సిట్టింగ్‌లకే టికెట్లు దక్కాయి. ఈసారి పెద్దగా మార్పులు లేకుండానే బీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దూకుతోంది. సీఎం కేసీఆర్ రెండుస్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నారు. అక్టోబర్ 16న వరంగ్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అదే రోజు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు.
స్టేషన్‌ఘన్‌పుర్, ఉప్పల్, వేములవాడ, వైరా, ఖానాపూర్, బోథ్, కామారెడ్డి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను సీఎం కేసీఆర్ మార్చారు. దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నారు. వేములవాడ చల్మెడ ఆనందరావు పేరును ఖరారు చేశారు. హుజురాబాద్ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేయనున్నారు. కోరుట్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ కుమారుడికి టికెట్ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురికి టికెట్ కేటాయించారు. నర్సాపూర్, జనగా, గోషామహల్, నాంపల్లి సీట్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించేందుకు త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులను బట్టి అభ్యర్థులను మారుస్తామని ట్విస్ట్ ఇచ్చారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ నుంచి బయటకు పంపించేస్తాని స్పష్టం చేశారు. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేతల్లో అసమ్మతి సర్దుకుంటుందని గులాబీ బాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను నాయకుల కోరిక మేరకే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంఐఎం తమకు మిత్రపక్షం అని చెప్పారు.
వామపక్షాలతో పొత్తు వార్తలు రాగా.. అభ్యర్థుల ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. కామ్రేడ్లకు కేసీఆర్ మొండి చేయి చూపించారు. సీపీఐ, సీపీఎం అడుగుతున్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో ఇక వామపక్షలతో పొత్తు లేనట్లేనని అంటున్నారు. గత కొంతకాలంగా పొత్తుల కోసం వామపక్షాలు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వామపక్షాల ప్రతిపాదనలు బీఆర్ఎస్ పట్టించుకోలేదు.
Also Read: Onion Prices Today: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 40 శాతం ఎగుమతి సుంకం విధింపు
Also Read: CM Jagan Mohan Reddy: ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. దసరా కానుకగా డీఏ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook