Srikalahasti Temple News: శ్రీకాళహస్తీశ్వరాలయానికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విచ్చేసిన సందర్భంగా అధికారులు, ధర్మకర్తల మండలి ప్రదర్శించిన అత్యుత్యాహంపై భక్తులు, ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రచార రథం పర్యటన నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా ఈ ప్రచార రథం ప్రారంభోత్సవం కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా నిన్న సాయంత్రమే ఇక్కడి ఆలయానికి మంత్రి కొట్టు సత్యనారాయణ వచ్చారు. అనంతరం నిన్న రాత్రి ప్రదోష కాలంలో స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్నారు.
బుధవారం ప్రచార రథం ప్రారంభోత్సవానికి సంబంధించి వేదిక ఆలయ అవరణలోని ఓంకార మఠం ముందు ఏర్పాటు చేశారు. నాలుగో గేటు నుంచి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేదించి మిగిలిన మూడు ద్వారాల ద్వారా అనుమతించారు. అలాగే నాలుగో గేటు వద్ద గల దేవస్థానానికి సంబంధించిన దుకాణాల సముదాయంలో అన్ని దుకాణాలను కార్యక్రమం పూర్తయ్యే వరకు మూసివేయాలని అధికారులు మౌళిక ఆదేశాలిచ్చారు.
క్యూలైన్లను మూసివేయడంతో సరిపెట్టుకోని అధికారులు.. ఆలయం ఆవరణలోని షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న అన్ని దుకాణాలను మూసివేశారు. భక్తుల క్యూలైన్లను మూసివేసి తమ గిరాకీపై ప్రభావం పడేలా చేయడమే ఒక నష్టం అనుకుంటే.. ఏకంగా తమ దుకాణాలు మూసివేయించడం ఏంటంటూ దుకాణాల యజమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ మొత్తంలో డబ్బులు పోసి తాము ఈ దుకాణాలకు స్థలం దక్కించుకుంటే ఇప్పుడిలా దుకాణాలు మూసేస్తే తమకి వ్యాపారం నష్టపోదా అని అధికారుల ఎదుట వాపోయారు. మంత్రిగారు వచ్చిన ప్రతీసారి ఇలాగే దుకాణాలు మూయిస్తారా అని దుకాణదారులు ప్రశ్నించారు. ఒకవేళ అధికారులు మంత్రి వచ్చిన ప్రతీసారి అలాగే చేస్తే ఇక తమ వ్యాపారం ఎలా నడిచేది అని ఇంకొంతమంది నిలదీశారు. అయినప్పటికీ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా దుకాణాలు మూసేయించి వెళ్లారు. దీంతో మంత్రి మళ్లీ ఎప్పుడు వెళ్లిపోతారా .. మళ్లీ ఎప్పుడు దుకాణాలు తెర్చుకోవచ్చా అని ఎదురుచూడటం అక్కడి దుకాణదారుల వంతయ్యింది.
ఇది కూడా చదవండి : Outsourcing Employees Salaries: విద్యుత్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఇదిలావుంటే, మరోవైపు దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శనార్ధం విచ్చేశారు. ఆ సమయంలో అధికారుల, ధర్మకర్తల మండలి సభ్యులు క్యూలైన్లను గంటల తరబడి మూసివేశారు. మంత్రి వచ్చిన సమయంలో గంటల తరబడి క్యూలైన్లలో వేచివున్న భక్తులు ఒక్కసారిగా మంత్రి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో శ్రీకాలహస్తిలో భక్తుల నుంచి మంత్రి నిరసన సెగ ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి : Vangaveeti Radha krishna wedding: పెళ్లి పీటలెక్కనున్న వంగవీటి రాధా.. త్వరలోనే ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి