Unhealthy Junk Food Items To Be Avoided: మంచి అలవాట్లను అలవర్చుకునే విషయంలో రేపు, ఎల్లుండి అని మీనమేషాలు లెక్కించొద్దు. ఒక మంచి పనిని మొదలుపెట్టడానికి వారం, వర్జ్యంతో పనిలేదు.. ప్రతీ రోజూ మంచి రోజే అని భావించాల్సి ఉంటుంది అని చెబుతుంటారు మన పెద్దలు. ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి ఫిట్నెస్ ఎంత ముఖ్యమో.. బాడీ ఫిట్‌గా ఉండటానికి హెల్తీ ఫుడ్ తినడం కూడా అంతే ముఖ్యం అనే విషయం మర్చిపోవద్దు. అందుకే వీలైనంత త్వరగా అన్‌హెల్తీ ఫుడ్‌ని దూరం పెట్టి హెల్తీ ఫుడ్ అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యానికి హాని చేసే జంక్ ఫుడ్‌ని, ఆయిల్ ఫుడ్‌ని, ఫ్యాటీ ఫుడ్స్‌ని దూరంగా పెట్టాలి. ఇందులో ఎలాంటి సెకండ్ థాట్ పెట్టుకోవద్దు. అప్పుడు మనమే కాదు.. మన లైఫ్ స్టైల్ కూడా హెల్తీగా, హ్యాపీగా ఉంటుంది.
వేపుళ్లు :
వేపుళ్లలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వేపుడు ఆహార పదార్థాల్లో కేలోరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాంటి వాటిపై చీజ్ యాడ్ చేస్తే అది మరింత హానికరం అవుతుంది. కానీ చాలావరకు జంక్ ఫుడ్స్‌పై చీజ్ యాడ్ చేసి ఇస్తారు. అలాంటి ఫ్రైస్ నోటికి రుచిస్తాయి కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఫ్రైస్ ని ఎంత దూరం పెడితే ఆరోగ్యానికి అంత మంచిది.
కాఫీ :
చాలామందిని కాఫీని అమితంగా ఇష్టపడుతుంటారు. వారికి తెలియకుండానే అది వారి దినచర్యలో ఒక భాగమైపోతుంది. పొద్దున్నే నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే లోపు రెండు లేదా మూడు సార్లయినా కాఫీ తాగుతుంటారు. కానీ కాఫీలో కెఫైన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కెఫైన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మత్తుగా ఉండటం, ఆందోళన, ఏదో తెలియని భయం, నిద్రలేమి, బీపీ ఎక్కువ అవడం, కళ్లు తిరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి.
ఆల్కాహాల్ :
ఆల్కాహాల్ ఎక్కువ మోతాదులో తాగడం వల్ల డీహైడ్రేషన్, తీవ్రమైన అలసట, మైగ్రేన్ నొప్పి వంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆల్కాహాల్ పరిమితి మించనంత వరకు పర్వాలేదు కానీ శృతి మించితేనే అసలు సమస్య అంటున్నారు పరిశోధకులు. పైగా ఆల్కాహాల్ తాగడం వల్ల లివర్ పాడై ఆరోగ్యం చెడిపోతుంది. అది ప్రాణాలకే ప్రమాదం తీసుకొస్తుంది.
ఫ్రోజెన్ ఫుడ్స్ :
ఫ్రిజ్‌లో పెట్టుకుని, మైక్రోవోవెన్లో వేడి చేసి తినే ఆహారాలు అన్నీ ఆరోగ్యానికి హాని చేసేవే. అలాంటి పద్ధతికి ఇక స్వస్తి చెప్పండి. ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ చేసుకుని తినే ఫుడ్ ప్రోడక్ట్స్‌లో అవి నిల్వ ఉండటం కోసం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఎక్కువ మోతాదులో సోడియం కూడా ఉంటుంది. అవన్నీ ఆరోగ్యానికి హాని చేసేవే అనే విషయ మర్చిపోవద్దు.
సాఫ్ట్ డ్రింక్స్ :
సాఫ్ట్ డ్రింక్స్ లో కెఫైన్, షుగర్ అధికంగా ఉంటుంది. అవి మీ ఆరోగ్యానికి చెప్పలేనంత హానీ చేస్తాయి. పుప్పి పళ్ల నుంచి స్థూలకాయం వరకు అదే అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం. ఈ సాఫ్ట్ డ్రింక్స్ స్థానంలో గ్రీన్ టీ లేదా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, లేదా నీరు తాగడం అలవాటు చేసుకోండి. అవి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
డోనట్స్, పేస్ట్రీస్, వాల్నట్స్ :
డోనట్స్, పేస్ట్రీస్, వాల్నట్స్ వంటి జంక్ ఫుడ్స్ నోటికి ఎంతో రుచిగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి అవి తీవ్రమైన హాని తలపెడతాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఏ మాత్రం లేకపోగా.. డేంజరస్ హై కేలోరీలు ఉంటాయి. ఇవి గుండెకు హానీ చేస్తాయి. మిమ్మల్ని అధిక బరువు పెరిగేలా చేస్తాయి.
చికెన్ నగ్గెట్స్ :
చికెన్ నగెట్స్ అనారోగ్యం ఏమీ కాదు.. అందులో చికెన్ ఉంటుంది కనుక అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని కొంతమంది వాదిస్తుంటారు. కానీ అది అర్థం లేని వాదన. ఎందుకంటే చికెన్ నగెట్స్ లో ఉండే చికెన్ ఉడికించిన చికెన్ కాదు. అది ఫ్రై చేసిన చికెన్. పైగా చికెన్ నగెట్స్ తయారీ విధానం ఆరోగ్యకరంగా ఉండదు. మైద పిండి, సోడియం, రుచి కోసం టేస్టింగ్ సాల్స్, ఇంకొన్ని మసాలాలు దట్టిస్తారు. అవన్నీ ఆరోగ్యానికి హాని చేసేవే.
ఇది కూడా చదవండి : Drinking Water While Eating Food: అన్నం తినే ముందు నీళ్లు తాగితే మంచిదా ? అన్నం తిన్న తరువాత మంచిదా ?
శుద్ధమైన నెయ్యి :
చాలామంది శుద్ధమైన నెయ్యి వెంట పరుగులు తీస్తుంటారు దాని కంటే రోజుకు 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగించడం ఉత్తమం అంటున్నారు హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్. ఇంకా వీలైతే ఆలీవ్ ఆయిల్స్ ఉపయోగించడం మంచిది.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించానికి ముందు వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి