/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Health Tips: ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టే ఆయుర్వేద శాస్త్రంలో ఉసిరికి విశేష ప్రాధాన్యత ఉంది. ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. అందుకే ఒక్క ఉసిరితో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చుంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. పూర్తి వివరాలు మీ కోసం..

ఆయుర్వేదంలో ఉసిరికాయలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఉసిరిని ఔషధ గుణాల పొదరిల్లుగా పిలుస్తారు. ఉసిరికాయ జ్యూస్ లేదా ఉసిరి నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా..ఫిట్ అండ్  స్లిమ్‌గా ఉంచుతుంది. అంటే అధిక బరువు సమస్యను దూరం చేసేందుకు ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఉసిరికాయను విటమిన్ సికు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. విటమిన్ సి అనేది చాలా రకాల రోగాల్నించి కాపాడే అద్భుతమైన విటమిన్. అందుకే ఉసిరికాయ జ్యూస్ రోజూ డైట్‌లో చేర్చుకుంటే..అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కడుపు, లివర్‌లను ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరికాయ పాత్ర అమోఘమైంది. 

ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి విటమిన్ సి అద్భుత రక్షణ కల్పిస్తుంది. ప్రతి రోజూ ఉసిరికాయ తీసుకుంటే ఎనీమియా సమస్య ఉండదు. ఉసిరిలోని పోషక పదార్ధాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో ఉసిరికాయలు సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. 

ఉసిరికాయల్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే..ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటారు. ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గడంలో దోహదమౌతుంది. ఉసిరి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెటబోలిజం వృద్ధి చెందుతుంది. మెటబోలిజం వృద్ధి చెందితే..స్థూలకాయం సమస్య తగ్గుతుంది. ఎందుకంటే శరీరంలో తలెత్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం జీవక్రియ సరిగ్గా లేకపోవడమే. జీవక్రియ సరిగ్గా ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి.

Also read: Tomato Reduce Cholesterol: టమాటో రసం ప్రతి రోజు తాగితే కొలెస్ట్రాల్‌ వెన్నలా 15 రోజుల్లో కరడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Health Tips and benefits of amla to your health, take daily and get relief from obesity improves metabolism, checks all health problems
News Source: 
Home Title: 

Health Tips: రోజూ ఆ ఒక్కటి తీసుకుంటే చాలు అన్ని అనారోగ్య సమస్యలకు చెక్

Health Tips: రోజూ ఆ ఒక్కటి తీసుకుంటే చాలు అన్ని అనారోగ్య సమస్యలకు చెక్
Caption: 
Amla Benefits ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Health Tips: రోజూ ఆ ఒక్కటి తీసుకుంటే చాలు అన్ని అనారోగ్య సమస్యలకు చెక్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Thursday, August 10, 2023 - 22:15
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
36
Is Breaking News: 
No
Word Count: 
255